షహీన్‌బాగ్ షూటర్‌కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్ట్..!
దేశ రాజధాని ఢిల్లీలో షహీన్‌బాగ్‌లో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల గురించి తెలిసిందే. నిరసనలతో ప్రారంభమై.. హింసాత్మక రూపాన్ని దాల్చాయి. ఈ షహాన్ బాగ్ ప్రాంతంలో గత ఫిబ్రవరి 1వ తేదీన కపిల్ బైసలా అనే గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా శనివారం ఢిల్లీ కోర్టు కపిల్ బైసలాకు బెయిలు మంజూరు చేసింది. ఈస్ట్ ఢిల్లీలో దల్లుపుర […]
దేశ రాజధాని ఢిల్లీలో షహీన్‌బాగ్‌లో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల గురించి తెలిసిందే. నిరసనలతో ప్రారంభమై.. హింసాత్మక రూపాన్ని దాల్చాయి. ఈ షహాన్ బాగ్ ప్రాంతంలో గత ఫిబ్రవరి 1వ తేదీన కపిల్ బైసలా అనే గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా శనివారం ఢిల్లీ కోర్టు కపిల్ బైసలాకు బెయిలు మంజూరు చేసింది.
ఈస్ట్ ఢిల్లీలో దల్లుపుర ప్రాంతానికి చెందిన కపిల్ బైసలా.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు.. ఫిబ్రవరి 1న గాలిలో మూడుసార్లు కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోర్టుకు హాజరుపర్చడంతో.. అతడిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. అయితే విచారణలో కపిల్ తనకు వ్యక్తిగతంగా జరిగిన ఇబ్బందుల ద్వారానే అలా చేశానంటూ చెప్పుకొచ్చాడు. తన కుటుంబానికి చెందిన వారిది త్వరలో పెళ్లి ఉందని.. ఈ మార్గాన వెళ్లాలంటే.. నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కనీసం షాపింగ్ చేయాలన్న కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. ఈ ఆందోళనకారుల తీరువల్లే.. తరచు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయేవాడిని.. ఇలా ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అవుతుండటం తనను తీవ్ర ఆగ్రహం కల్గిందని పేర్కొన్నాడు. అయితే చట్టప్రకారం పోలీసులు కపిల్‌పై కేసు నమోదు చేశారు.