చిత్తూరు జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య..
చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలో దారుణ హత్య జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఎమ్మార్వోను నరికి చంపాడు ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఈ హత్య చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బంగారపేట తాలూక పెరియకలవంచి తహసీల్దార్ చంద్రమౌలేశ్వర్‌ను, అదే గ్రామానికి చెందిన వెంకటపతి అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్..
చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలో దారుణ హత్య జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఎమ్మార్వోను నరికి చంపాడు ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఈ హత్య చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బంగారపేట తాలూక పెరియకలవంచి తహసీల్దార్ చంద్రమౌలేశ్వర్‌ను, అదే గ్రామానికి చెందిన వెంకటపతి అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరికి చంపాడు. ప్రభుత్వ భూముల సర్వే కోసం కలవంచి గ్రామానికి వెళ్లిన తహసీల్దార్ ను, తమ భూమి సర్వే చేయడానికి కుదరదని హెడ్ మాస్టర్ వెంకటపతి అడ్డుకున్నాడు. అయితే పోలీసు బలగాలతో భూమిని సర్వే నిర్వహించారు తహసీల్దార్ చంద్రమౌలేశ్వర్. తన భూమిని అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ.. విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్‌ని అక్కడే ఉన్న కత్తితో నరికాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్. దీంతో ఎమ్మార్వో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన తహసీల్దార్‌ను.. సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చంద్రమౌళి మరణించాడు. కాగా హత్య చేసిన అనంతరం అక్కడే ఉన్న పోలీసులకి లొంగిపోయాడు హెడ్ మాస్టర్ వెంకటపతి.
Read More:
Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!
గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.. బన్నీ పక్కన హీరోయిన్ అంటూ..