Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..!

Crime News Latest: మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో అతి కిరాతకంగా చంపిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది...

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 03, 2021 | 1:33 PM

Crime News Latest: మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో అతి కిరాతకంగా చంపిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేవీబీపురం బీసీ కాలనీకి చెందిన టైలర్ సూరిబాబు(37), సుహాసిని(32) పద్నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తనకు చేదోడు వాదోడుగా ఉంటుందని భార్య సుహాసినికి సూరిబాబు టైలరింగ్ నేర్పించాడు. ఇక వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లు వీరిద్దరి జీవితం బాగానే గడిచినా.. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. (Man Killed Wife Over Extra Marital Affair)

అందరూ ఆడపిల్లలనే ఎందుకు కన్నవంటూ రోజూ సూరిబాబు భార్యతో గొడవపడేవాడు. అంతేకాకుండా భార్యను అనుమానిస్తూ వేధించేవాడు.ఈ క్రమంలోనే ఐదు నెలల క్రితం భార్యబిడ్డలను వదిలిపెట్టి సూరిబాబు తన నివాసాన్ని శ్రీకాళహస్తికి మార్చుకున్నాడు. రోజూ కేవీబీపురం వచ్చి అద్దె ఇంటిలో టైలరింగ్ చేసుకుంటున్నాడు.

అటు పిల్లలను తన దగ్గరకి పంపించేయలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. దానికి భార్య ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపధ్యంలోనే మంగళవారం సుహాసిని కిరాణా షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా సూరిబాబు మార్గం మధ్యలో ఆమెను కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం కేబీవీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. కాగా, తల్లిని చంపిన తండ్రికి కఠిన శిక్ష విధించాలంటూ ముగ్గురు కుమార్తెలు పోలీస్ స్టేషన్ ఎదుట కంటతడి పెట్టుకున్నారు. (Man Killed Wife Over Extra Marital Affair)

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?