రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?
Madanapalle Incident: మదనపల్లె జంట హత్యల కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్‌తో అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది....

Madanapalle Incident: మదనపల్లె జంట హత్యల కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్‌తో అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది. హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా అసలు నిజం మాత్రం బయటికి రాలేదు. ప్రస్తుతం పోలీసులు పురుషోత్తమ నాయుడు, పద్మజ కుటుంబానికి సంబంధించి సామాజిక మాధ్యమాలను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య, సాయి దివ్యలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లలో హత్య తర్వాత కూడా మార్పులు జరగడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
‘‘వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్’’ అంటూ జనవరి 21వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అలేఖ్య.. ఆ తర్వాతి రోజు కృష్ణుడి ఫోటోతో సెల్ఫీ దిగి.. మోహినీ అనే హ్యాష్‌ట్యాగ్ వాడింది. ఇలా హత్య జరగటానికి మూడు రోజుల ముందు వరకు అలేఖ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి దివ్య అకౌంట్‌లో ఎవరో మార్పులు చేశారనేలా పలు పోస్టులు దర్శనమయ్యాయి. అటు అలేఖ్య సోషల్ మీడియా ఖాతా సెట్టింగ్‌లను కూడా ఎవరో మార్చి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో సాయిదివ్య, అలేఖ్యకు సంబంధించిన ఖాతాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..