కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నం.. ఊపిరాడక ముగ్గురు దొంగలు మృతి

కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నించి ఊపిరాడక ముగ్గురు దొంగలు మృతి చెందారు. ఈ ఘటన కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనుల్లో జరిగింది. కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గునుల్లో ఇనుప సామాగ్రీని దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు..

కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నం.. ఊపిరాడక ముగ్గురు దొంగలు మృతి
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 4:11 PM

కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నించి ఊపిరాడక ముగ్గురు దొంగలు మృతి చెందారు. ఈ ఘటన కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనుల్లో జరిగింది. కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గునుల్లో ఇనుప సామాగ్రీని దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. వారు 100 అడుగుల లోతు గల బావిలోకి వెళ్లగా.. అక్కడ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోయింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

దొంగలు లోపల నుంచి పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే మరణించినవారిలో రెండు మృత దేహాలు దొరక్కా.. మరొకరిది ఇంకా దొరకలేదు. ఇప్పటికే పోలీసులు టార్చ్‌లు, లైట్లతో గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా లాక్‌డౌన్ అమల్లో ఉండటం వల్ల కోలార్ ప్రాంతంలో బంగారం వెలికి తీత పనులు నిలిచిపోగా.. కేజీఎఫ్ గనులు ఎప్పటినుంచో మూతపడి ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీ చేద్దామని ప్రయత్నించిన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

Read More:

లాక్‌డౌన్‌లో సైలెంట్‌గా.. ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..