గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్, ఇంటర్‌ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!

ఇప్పటికే పదో తరగతి పరీక్షల నిర్వహణపై చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. కానీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం టెన్త్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు...

గుడ్‌న్యూస్: అక్కడ విద్యార్థులకు టెన్త్, ఇంటర్‌ పరీక్షలు లేవు.. డైరెక్ట్ పాస్!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 1:17 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని విద్యా సంస్థలూ మూతపడ్డాయి. అందులోనూ పరీక్షల సమయం కావడంతో అవన్నీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కొన్ని మినహాయింపులను కేంద్రం ఇస్తుండటంతో పరీక్షల నిర్వహణపై చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. కానీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించింది. పరీక్షలు అర్థాంతరంగా ఆగిపోవడంతో అందరిని పాస్ చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని భావించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా ఇటీవల అక్కడ పది, ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయినా మధ్యలో వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుత పరీస్థితుల్లో పరీక్షలు నిర్వహించే కంటే పై తరగతులకు పంపడమే ఉత్తమమని ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖ అభిప్రాయపడింది. దీంతో ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా.. విద్యార్థులకు మార్కులు కేటాయించి పై తరగతులకు ప్రమోట్ చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా దగ్గర పడుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయకపోయినా కూడా సాధారణ మార్కులతో పాస్ చేయాలని విద్యాశాఖ అధికారులను సూచించింది. ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా అందరినీ పాస్ చేసి పై తరగతులకు పంపాలని అధికారులను ఆదేశించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. దీంతో అక్కడి విద్యార్థులు తెగ సంబరపడిపోతున్నారు.

Read More:

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్