AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిణి జైలుల్లో ఒక్కసారిగా కలవరం

కరోనా మహమ్మారీ కారాగారంలోని ఖైదీలను సైతం వదలడంలేదు. ఇంతకాలం బయట తిరిగేవారిని అంటుకున్న కరోనా జైలులోని ఖైదీలను కబళిస్తోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి జైలులోని ఓ క్రిమిన‌ల్ ఖైదీకి క‌రోనా సోకింద‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన క‌రోనా బాధితుడికి హ‌త్యాయ‌త్నాం, దోపిడి లాంటి మూడు క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించి శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఆ త‌ర్వాత కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్షించ‌గా, […]

రోహిణి జైలుల్లో ఒక్కసారిగా కలవరం
Pardhasaradhi Peri
|

Updated on: May 14, 2020 | 4:40 PM

Share

కరోనా మహమ్మారీ కారాగారంలోని ఖైదీలను సైతం వదలడంలేదు. ఇంతకాలం బయట తిరిగేవారిని అంటుకున్న కరోనా జైలులోని ఖైదీలను కబళిస్తోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి జైలులోని ఓ క్రిమిన‌ల్ ఖైదీకి క‌రోనా సోకింద‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీ సంగం విహార్ నివాసి అయిన క‌రోనా బాధితుడికి హ‌త్యాయ‌త్నాం, దోపిడి లాంటి మూడు క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించి శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఆ త‌ర్వాత కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్షించ‌గా, క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. జైలులో ఉన్నప్పడు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌న్న జైలు అధికారులు.. అత‌నికి క‌రోనా ఎలా సోకింద‌నే అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్త చ‌ర్య‌గా జైలులోని 20 మంది ఖైదీలు, ఐదుగురు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పటికే ముంబై ఆర్థ‌ర్ రోడ్ జైలులోని ఖైదీలకు, సిబ్బందికి కోవిడ్ సోకింది. అటు ఢిల్లీ తీహార్ జైలులోనూ క‌రోనా కేసులు వెలుగుచూశాయి తాజాగా మరో జైలులో కరోనా వెలుగుచూడడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..