AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా మహిళకు రూ. 2 కోట్ల జరిమానా.. జూమ్ యాప్‌లో తీర్పు..

కాలేజీ అడ్మిషన్ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన చైనా మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జీ ఆమెకు రూ. కోటి 89 లక్షలు జరిమానా విధించారు.

చైనా మహిళకు రూ. 2 కోట్ల జరిమానా.. జూమ్ యాప్‌లో తీర్పు..
Jyothi Gadda
|

Updated on: May 19, 2020 | 6:19 PM

Share

కొడుకు కోరిన కాలేజీలో సీటు ఇప్పించేందుకు గానూ చైనాకు చెందిన ఓ మహిళా కాలేజీ యాజమాన్యానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా..జడ్ఢి ఆమెకు రూ.2.5 లక్షల డాలర్ల(రూ. కోటి 89 లక్షలు) జరిమానా విధించారు. ఇంతకీ అది ఏ కాలేజీలోనో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాజ్ ఏంజిల్స్( యూసీఎల్ఏ)లో తన కొడుకుకు అడ్మిషన్ కోసం ప్రయత్నించింది చైనాకు చెందిన సుయ్ జియోనింగ్ అనే మహిళ. అందుకోసం 4 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 2 లక్షలు) లంచం ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే, ఈ సంఘటన 2019లో చోటు చేసుకుంది. అప్పుడే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కెనాడాలో నివసిస్తున్న సదరు మహిళను 2019 సెప్టెంబర్‌లోనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఐదు నెలలపాటు స్పెయిన్‌లోనే ఆమె జైలు శిక్ష అనుభవించింది.

కాగా, ఫిబ్రవరిలో సుయ్ జియోనింగ్‌ని కోర్టులో హాజరుపర్చగా..జడ్జీ తీర్పును వాయిదా వేశారు. తాజా విచారణలో తన క్లైంట్ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతోందని సుయ్ తరపు న్యాయవాది జడ్జితో తెలిపారు. కాగా, లంచం కేసులో ఆమె అరెస్ట్ అయినందుకు గానూ జడ్జీ ఆమెకు భారీ జరిమానా విధించారు. సుయ్ కోర్టుకు 2.5 లక్షల డాలర్ల(రూ. కోటి 89 లక్షలు) జరిమానా చెల్లించాలన్నారు. అయితే, ప్రస్తుత కరోనా నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా జడ్జి తీర్పునివ్వడం గమనార్హం.

Follow Us
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి