AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు గ్లామరస్ క్వీన్.. ఇప్పుడు స్టార్ హీరోలకు తల్లి పాత్రలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఒకప్పుడు కథానాయికగా సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సహయ నటిగా మారింది. దశాబ్దాలుగా సినీరంగంలో సహయ నటిగా రాణిస్తుంది. తాజాగా ఆమె పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అప్పటికీ.. ఇప్పటికీ మార్పు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Tollywood : అప్పుడు గ్లామరస్ క్వీన్.. ఇప్పుడు స్టార్ హీరోలకు తల్లి పాత్రలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Pavitra Lokesha
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2026 | 4:29 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో గ్లామరస్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. కథానాయికగా పలు చిత్రాల్లో అలరించింది. ముఖ్యంగా తమిళం, మలయాళం భాషలలో రాణించింది. ఆ తర్వాత సహయ నటిగా అనేక హిట్ చిత్రాల్లో కనిపించింది. వైవిధ్యమైన పాత్రలు పోషించి నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అంతేకాదు.. గ్లామర్ ఫోజులతో అప్పటి కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇటు వెండితెరపై.. అటు బుల్లితెరపై సహయ నటిగా రాణిస్తూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె పాత ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

పవిత్ర లోకేష్.. కర్ణాటకలోని మైసూర్ లో జన్మించారు. కన్నడ నాటక , చలనచిత్ర నటుడు మైసూర్ లోకేష్ కుమార్తె. ఆమె సోదరుడు లోకేష్ సైతం కన్నడ చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ ను వివాహం చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేశారు.. పవిత్ర లోకేశ్ తన 16వ ఏటనే కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కెరీర్ ప్రారంభించారు. కన్నడలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

తెలుగులో ‘సమ్మోహనం’, ‘మళ్ళీ రావా’, ‘రెడ్’, ‘అల వైకుంఠపురములో’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తల్లి, అత్త పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కన్నడ చిత్రం ‘నాయి నేరాలు’ (2006)లో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గానూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రలతో చాలా ఫేమస్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

పవిత్ర లోకేష్..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us