AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో, దొంగలు కూడా దీనిని అవకాశంగా మలుచుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్‌లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
Kurnool Bus Stand Chain Snatching
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 13, 2026 | 11:58 AM

Share

ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇతర రాష్ట్రాల మహిళలు అవకాశంగా తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎక్కడ చూసినా మహిళలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని గమనించిన ఇతర రాష్ట్రాల దొంగలు ఏపీలోకి చొరబడ్డారు. ఎక్కడైతే ఉచిత బస్సుకు మహిళల నుంచి డిమాండ్ అధికంగా ఉందో అక్కడ తిష్ట వేస్తున్నారు. అయితే.. ఎందుకు అనుకుంటున్నారా..? ప్రయాణికుల నుంచి ఆభరణాలను, డబ్బులను దొంగలించేందుకు.. అవును.. అలా తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు బంగారం దొంగలించి.. చివరకు కటకటాల పాలయ్యారు. బంగారానికి ఇప్పుడు భారీగా ధర పెరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి బంగారు చైన్లు వేసుకున్న మహిళలు ఉచిత బస్సు కోసం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికుల మాటున వేచి ఉండి మహిళా దొంగలు తమ పని సులభంగా చేసుకుంటున్నారు. మహిళా ప్రయాణికులతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా ఉంటుందని మహిళా దొంగలు తిష్ట వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే బస్టాండ్లో ఇలాంటి బంగారు చోరీలు జరిగాయి.

తాజాగా.. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వరమ్మ.. కర్నూలు ఏ. క్యాంపులో నివాసం ఉంటున్న తన కుమారుడు వెంకటేశ్వరులను చూసేందుకు పట్టణానికి వచ్చింది.. అలా కర్నూలు వచ్చి తిరిగి గిద్దలూరు వెళ్లేందుకు గత నెల 11న బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఆమె మెడలోని బంగారు గొలుసు మాయమైంది. బంగారు గొలుసు లేదనే విషయం తెలుసుకుని స్థానిక నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పెద్దపాడుకు చెందిన బ్యాంక్ మహిళా ఉద్యోగి కూడా అదే రోజు విధులకు వెళ్ళేందుకు బస్సు కోసం బస్టాండ్ లో వేచి ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును కూడా చోరీ చేశారు. దీంతో ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది..

Kurnool Bus Stand Chain Snatching

Kurnool Bus Stand Chain Snatching

తమిళనాడు నుంచి వచ్చి..

ఇద్దరు మహిళా బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.. ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.ఈ క్రమంలోనే.. అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను విచారించగా వారిది తమిళనాడు రాష్ట్రంలోని జోలార్ పేటకు చెందిన భాగ్య, హన్నమ్మలుగా గుర్తించారు. బెంగళూరు శివార్లలోని కుప్పం ప్రాంతంలో వారు సంచరిస్తున్నట్లు గుర్తించి పోలీస్ టీం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే.. కుప్పం ప్యాలెస్ రోడ్డులో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 6:30 తులాల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా దొంగలను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కు తరలించారు.

అయితే.. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని.. అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us