AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce: విడాకుల భరణంగా ‘తల్లి’కి 750 కోట్లు చెల్లించాలంటూ లండన్ కోర్టు తీర్పు.. ఎందుకంటే..

ఏ కారణం చేత విడాకులు తీసుకున్నా మహిళలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదని చట్టాలు చెబుతాయి. అందుకోసం భరణం చెల్లించాలని సూచిస్తాయి.

Divorce: విడాకుల భరణంగా 'తల్లి'కి 750 కోట్లు చెల్లించాలంటూ లండన్ కోర్టు తీర్పు.. ఎందుకంటే..
Divorce
KVD Varma
|

Updated on: Apr 26, 2021 | 11:38 PM

Share

Divorce: ఏ కారణం చేత విడాకులు తీసుకున్నా మహిళలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదని చట్టాలు చెబుతాయి. అందుకోసం భరణం చెల్లించాలని సూచిస్తాయి. అంటే, ఆ మహిళ బ్రతకడానికి కావలసినంత సొమ్ము ఇవ్వడం అని తెలుసు కదా. ఒక్కోసారి ఆయా మహిళల డిమాండ్.. ఆ పురుషుల ఆర్ధిక స్థితి.. పరిస్థితులను బట్టి అది కొద్దిగా మారుతుంది. కొద్ది మొత్తం ఎక్కువ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కానీ, ఓ మహిళకు ఏకంగా 750 కోట్ల భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. భరణం ఆ మహిళ భర్త కాకుండా ఆమె కొడుకు చెల్లించాలని లండన్ కోర్టు తీర్పు చెప్పడం. వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రఖ్ అఖం దోవ్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త. ఆమె భార్య తాతియానా. వీరికి ఇద్దరు కొడుకులు. ఈమధ్య దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వారు విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఈ విడాకుల సమయంలో వారు లండన్ లో ఉండేవారు. తల్లితో చిన్న కొడుకు, తండ్రితో పెద్ద కొడుకు విడాకులు తీసుకున్న తరువాత ఉంటూ వచ్చారు. విడాకులు మంజూరు చేసే సమయంలో లండన్ కోర్టు తాతియానా కు 750 కోట్లు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది. కానీ, అతను కొంత సొమ్ము చెల్లించి రష్యా వెళ్ళిపోయాడు. తాతియానా పెద్ద కొడుకు తల్లికి డబ్బు ఇవ్వకుండా ఆడుపడుతూ వచ్చాడు. దీంతో త‌న‌కు రావాల్సిన మిగిలిన భ‌ర‌ణం కోసం తాతియానా మ‌రోసారి లండ‌న్‌ కోర్టును ఆశ్రయించింది.

తండ్రికి తెమూర్ తరపున వత్తాసు పలుకుతూ త‌న‌కు రావాల్సిన సొమ్ము రాకుండా చేస్తున్నాడ‌ని పెద్ద కుమారుడిపై దావా వేసింది. ఇందుకు సమాధానంగా ఆమె కొడుకు .. తాను చాలా న‌ష్టాల్లో ఉన్నాన‌ని, లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో చ‌దివేట‌ప్పుడు ట్రేడింగ్‌లో డ‌బ్బు పెట్టి నష్టపోయాననీ కోర్టుకు చెప్పాడు. దీంతో లండన్ కోర్టు విబెధించింది. తాతియానాకు వెంటనే 750 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

Also Read: Corona Pan demic: బీహార్ లో దారుణం..కరోనా వచ్చిందని భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!

Wild Dog movie: ఓటీటీలో వైల్డ్ డాగ్.. నేష‌న్ వైజ్ గుడ్ రెస్పాన్స్.. నాగ్ అంటే ఆ మాత్రం ఉండాలి