కూకట్‌పల్లిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి!
హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం (జులై 22) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సత్య శిరీషను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని దొమ్మేరు గ్రామానికి చెందిన కలగర సత్య శిరీష అనే […]
హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం (జులై 22) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా సత్య శిరీషను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని దొమ్మేరు గ్రామానికి చెందిన కలగర సత్య శిరీష అనే మహిళ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ స్థానికంగా నివాసం ఉంటోంది. ఆమె భర్త గోపాల కృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో గోపాల కృష్ణ విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి శిరీష.. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
సత్య శిరీష కుటుంబం కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గోపాల కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.