Crime News: ఏటీఎంలలో వరుస చోరీలు చేస్తున్న దొంగల ముఠా! ఏకంగా రూ. 40 లక్షల నగదు లూటీ..

ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో దోపిడీ సంఘటనలు జరుగుతున్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి...

Crime News: ఏటీఎంలలో వరుస చోరీలు చేస్తున్న దొంగల ముఠా! ఏకంగా రూ. 40 లక్షల నగదు లూటీ..
Atm Robbing
Follow us

|

Updated on: Jan 28, 2022 | 9:54 PM

అస్సాం (Assam)లోని గువాహటి (Guwahati)లో ఓ మహిళ ATM మెషిన్ నుండి పెద్ద మొత్తంలో డబ్బును దొంగిలించినందుకు గానూ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ రాష్ట్రంలోని గౌహతికి చెందిన షాహిదా బేగంగా గుర్తించారు. జనవరి 27 (గురువారం)న గౌహతిలోని లతాసిల్ పరిసరాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు లతాసిల్‌ ATM నుండి 65,000లను దోపిడీ చేసింది. ఇప్పటికే నిందితురాలిపై పలు పోలీస్ స్టేషన్లలో అనేక దొంగతనాల కేసులు కూడా నమోదయ్యినట్టు, పోలీసులు చాలా కాలంగా ఆమె కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో దోపిడీ సంఘటనలు జరుగుతున్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

జనవరి 22న కూడా గౌహతిలోని లచిత్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి పగటిపూట చోరీకి పాల్పడ్డాడు. ఎల్‌పీజీ డీలర్‌ వద్ద ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి నుంచి హెల్మెట్‌ ధరించిన దొంగ రూ.3,04,420 దోచుకెళ్లాడు. దీంతో బాదితుడు నగరంలోని పల్టన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో దొంగపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరో చోట రెండు SBI ATMలను దొంగలు లూటీ చేశారు. ఈ విధంగా వరుస చోరీల్లో దొంగల ముఠా మొత్తం రూ. 40 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ATM నుండి డబ్బును దోచుకోవడానికి దుండగులు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి, చోరీలు చేస్తున్నారని తెలిపారు. సాక్ష్యాలు దొరకకుండా ATMలలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారని, దొంగల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసధికారులు తెలియజేశారు.

Also Read:

యూకే కుర్రాడి పెళ్లి గోల! ఏకంగా 5000 మంది క్యూకట్టారట.. మామూలోడు కాదుగా..!