మద్యం షాపులో ఇద్దరు దుండగుల ఓపెన్ ఫైర్.. రీజన్ ఇదే..
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. చండీగర్‌లని సెక్టార్9లో మంగళవారం నాడు ఓ మద్యం షాపులో దుండగులు కాల్పులకు దిగారు.

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. చండీగర్‌లని సెక్టార్9లో మంగళవారం నాడు ఓ మద్యం షాపులో దుండగులు కాల్పులకు దిగారు. ఈ సంఘటనలో మొత్తం నలుగరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగర్‌లోని ఓ మద్యం దుకాణంలోకి ఇద్దరు దుండగులు తుపాకీలతో మంగళవారం సాయంత్రం ప్రవేశించారు. వెంటనే వారి దగ్గర ఉన్న తుపాకీలను తీసి.. దుకాణం యజమానిపై కాల్పులకు దిగారు. ఏకంగా ఐదు ఆరు బుల్లెట్లను పేల్చారు. ఈ ఘటనలో మద్యం షాపు యజమానితో పాటు.. అక్కడ పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది కూడా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మద్యం దుకాణం యజమానితో పాటు.. మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మద్యం షాపు యజమానికి ఇదే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ కూడా ఉందని.. అయితే ఇతడికి డబ్బుల విషయంలో వేరే వారితో విభేదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ విషయంలోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్నికోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.



