Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ జైలు ఆహారం తినడం లేదు.. నీటితో బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నాడు!

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పదిహేను రోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో జైలు జీవితం గడుపుతున్నాడు.

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ జైలు ఆహారం తినడం లేదు.. నీటితో బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నాడు!
Aryan Khan
Follow us
KVD Varma

|

Updated on: Oct 19, 2021 | 7:54 PM

Aryan Khan Drugs Case:  షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పదిహేను రోజులుగా ముంబయి అర్ధర్ రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో అతనికి బెయిల్ దొరకలేదు. దీంతో జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే, జైలులో ఆర్యన్ ఖాన్ ఆహారం తీసుకోవడం లేదని.. తన వంతు ఆహారాన్ని తోటి ఖైదీలకు ఇచ్చేస్తున్నాడనీ తెలుస్తోంది. ఆర్యన్ ఉన్న జైలులోనే అక్టోబర్16 వరకూ జైలు జీవితం గడిపిన ఖైదీ శ్రవణ్ నాడార్ ను ఊటంకిస్తూ దైనిక్ భాస్కర్ ఆర్యన్ ఖాన్ జైలు జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఆ వివరాలిలా ఉన్నాయి. నాడార్ ఒక మోసం కేసులో ఆర్థర్ రోడ్ జైలులో ఆరు నెలలు ఉన్నారు. అతను సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు. ఆర్యన్ ను ఉంచిన బ్యారక్‌లోనే శ్రావణ్ కూడా ఉన్నాడు. ఆర్యన్ బ్యారక్‌లో ఆహారాన్ని అందించడం శ్రావణ్ విధి.

ఆర్యన్ ఉన్న సెల్ ఎలా ఉంటుందంటే..

ఆర్యన్, అతని సహచరులను వారం రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన తర్వాత నంబర్ 1 బ్యారక్‌కి తీసుకువచ్చారని శ్రావణ్ చెప్పారు. బ్యారక్‌లో 4 సెల్స్ ఉంటాయి. ఒక్కో సెల్ లో 100 మంది ఖైదీలు ఉన్నారు. అంటే, సెల్స్ లో కలిపి 400 మంది ఖైదీలు ఉన్నారు. అందరూ ఒకరి పక్కన ఒకరు నిద్రపోతారు. ఒక సెల్‌లో 4 టాయిలెట్‌లు ఉన్నాయి. ఇది ఒక వెస్ట్రన్.. 3 ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ తో ఉంది.

ఆర్యన్ ఇతర ఖైదీలకు తన ఆహారాన్ని ఇస్తాడు..

మొదటి రోజునే ఆర్యన్ జైలులో టీ తాగాడని శ్రవణ్ చెప్పాడు. నేను దానిని అతనికి ఇచ్చాను. అది తప్ప అతను ఏమీ తినలేదు. అతను క్యాంటీన్ నుండి బిస్కెట్లు, చిప్స్ ఆర్డర్ చేస్తాడు. బిస్కెట్‌ను నీటిలో ముంచి అతను తినడం నేను చాలాసార్లు చూశాను. బాటిల్ వాటర్ తాగుతాడు.

శ్రావణ్  జైలు నిబంధనల ప్రకారం ‘హక్ కా భట్టా’ (అతని వాటా ఆహారం) తీసుకోవాల్సి ఉందని చెప్పాడు. ఆర్యన్ తన ఆహారాన్ని తీసుకుంటాడు. కానీ, అతను దానిని ఇతర ఖైదీలకు ఇస్తాడు. అతను ఏమీ తినడు. చాలా సార్లు నేను, జైలు అధికారులు అతనిని తినమని చెప్పాము. కానీ అతను మనస్సు బాగోలేదు, ఆకలి లేదు అని మాత్రమే చెప్పాడు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా కూర్చున్నాడు. అంటూ శ్రవణ్ చెప్పుకొచ్చాడు.

జీన్స్ టీ షర్టుతో ఆర్యన్..

ఆర్యన్ ఇంటి నుండి టీ-షర్టు మరియు జీన్స్ ధరించి వచ్చాడని శ్రావణ్ చెప్పాడు. అతనికి ఎలాంటి వీఐపీ ట్రీట్మెంట్ అందడం లేదు. నేను నిన్నటి రోజు వస్తున్నప్పుడు, అతనికి మనీ ఆర్డర్ ద్వారా రూ.4500 వచ్చింది. వాటితో అతను 5 డజన్ల బిస్కేట్ ప్యాకేట్స్, వాటర్ బాటిల్స్, చిప్స్ తీసుకున్నాడని శ్రావణ్ తెలిపాడు. ఆర్యన్ టీవీ చూడడు. ఎవరితో మాట్లాడకుండా ఉంటాడని వివరించాడు.

ఇదీ ఆర్యన్ ఖాన్ దినచర్య

శ్రవణ్ ఉదయం 6 గంటలకు విజిల్ వేస్తుందని చెప్పాడు. ఖైదీల సంఖ్య. లెక్కించిన తర్వాత చేతులు, ముఖం కడుక్కున్న తర్వాత అల్పాహారం తీసుకోవడానికి ఆర్యన్ కూడా వస్తాడు. అల్పాహారంలో షీరా, పోహా, టీ ఉంటాయి. ఆర్యన్ దానిని మరొక ఖైదీకి ఇస్తాడు. 10 గంటలకు ఆహారం వడ్డిస్తారు. భోజనంలో 2 రోటీలు, పప్పు,కూరగాయలు ఉంటాయి. ఆర్యన్ దానిని కూడా ఇతరులకు ఇస్తాడు. ఆ తర్వాత అతను విశ్రాంతికి వెళ్తాడు. మధ్యాహ్నం 3 గంటలకు టీ ఇస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆహారం పెడతారు. దీనిని కూడా ఇతర ఖైదీలకు ఆర్యన్ ఇచ్చేస్తాడు. 6 గంటలకు మళ్లీ ఖైదీలందర్నీ లెక్కిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ బ్యారక్‌లకు తిరిగి వస్తారు. ఆర్యన్ నిశ్శబ్దంగా కూర్చుంటాడు లేదా నిశ్శబ్దంగా పడుకుంటాడు.

Also Read: Health Tips: ఈ పురాతన విధానం సర్వరోగ నివారిణి.. ఇలాచేస్తే..గుండెపోటు..క్యాన్సర్.. డయాబెటిస్..వంటి వ్యాధులు పరార్!

Food Habits: బీ కేర్‌ఫుల్! ఆహారంలో ఈ పదార్ధాలను కలిపి తీసుకుంటే కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్టే..

Senior Citizens: అరవై ఏళ్ళు దాటినా.. అలుపెరుగని పరుగులు.. జపాన్‌లో వృద్ధుల జీవన శైలి అదరహో!