AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..

కూలీ పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యువు కబళించింది.

Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
Road Accident
Nalluri Naresh
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 23, 2024 | 8:01 PM

Share

కూలీ పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పనులు ముగించుకొని ఆటోలో తిరిగి వస్తుండగా.. తలకాసి పల్లి క్రాస్ వద్ద వేగంగా వచ్చి ఢీకొంది.

పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కూలీలు తెల్లవారుజామున అరటి తోటలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కూలీల బతుకులను ఛిద్రం చేసింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ… బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ నలుగురిని మెరుగైన చికిత్స కోసం అధికారులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వీడియో చూడండి..

మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు.. ఓకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు కన్నీరు పెట్టించింది. మృతులు తాతయ్య, చిన్న నాగమ్మ, రామాంజునమ్మ, పెద్ద నాగమ్మ, చిన్న నాగన్న, కొండమ్మ, జయరాం గా పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..