AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అయ్యో.. నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది.. గుర్తుతెలియని ఓ మహిళ ఆస్పత్రి సిబ్బంది అంటూ చెప్పి చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లింది. ఎంతసేపటికీ బాబును తీసుకురాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

Hyderabad: అయ్యో.. నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
Niloufer Hospital
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2024 | 8:39 PM

Share

హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో నెల రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన కలకలం రేపింది.. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్‌ దంపతులకు నెల రోజుల క్రితం బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్‌ (కామెర్ల వ్యాధి) రావడంతో చికిత్స నిమిత్తం.. దంపతులు హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం కోసం నిలోఫర్ హాస్పిటల్ లో చిన్నారి తల్లి హసీనా బేగం, అమ్మమ్మ ఉన్నారు.

ఈ క్రమంలో గుర్తుతెలియని ఓ మహిళ వాళ్లు ఉన్న దగ్గరికి వచ్చింది.. ఆస్పత్రి సిబ్బంది అంటూ వారికి చెప్పింది. ఆ తర్వాత చిన్నారిని ఎత్తుకున్న ఆ మహిళ.. చికిత్స కోసం తీసుకెళ్తున్నట్లు బాబును తీసుకెళ్లింది. ఎంతసేపటికీ బాబును తీసుకురాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. ఆస్పత్రి మొత్తం వెతికినా బాబు, ఆ మహిళ కనిపించలేదు. దీంతో బోరున ఏడ్చుకుంటూ పరుగులు పెట్టారు..

ఆ తర్వాత బాబును ఎత్తుకెళ్లారంటూ తల్లి హసీనా నాంపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యం కారణంగానే కిడ్నాప్‌ చేశారని పసికందు తల్లి ఆరోపిస్తోంది..

వీడియో చూడండి..

కాగా.. నిలోఫర్ ఆసుపత్రిలో ఈ ఘటన కలకలం రేపింది.. వెంటనే  సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్