AP CM Relief Fund Scam: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. ఇలా స్కామ్ చేశారు

ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌ స్కామ్‌లో అసలు నిందితులు ఎవరో తేలిపోయింది. నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు అధికారులు గుర్తించారు.

AP CM Relief Fund Scam: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. ఇలా స్కామ్ చేశారు
Ap Cmrf Fund Scam
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 23, 2021 | 6:56 PM

ఏపీలో సీఎంఆర్‌ఎఫ్‌ స్కామ్‌ సంచలనం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు 2014 నుంచి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. సచివాలయ సిబ్బందే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఏసీబీ అధికారులు తేల్చారు. మొత్తం 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. 60 లక్షల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేల్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 409, 420, 468, 471 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 21న కేసు రిజిస్టర్‌ చేశారు ఏసీబీ అధికారులు. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో 50 మంది ప్రమేయం ఉన్నట్టు మొదట భావించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అయితే నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు.

తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRF నిధులు నొక్కేసినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. CMRFలో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. CMRFలాగిన్ ఐడీ, పాస్ వర్డ్‌లని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు గుర్తించారు. సచివాలయంలో పనిచేసే చలువాడి సుబ్రమణ్యం, సోక రమేశ్‌లతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చదలవాడ మురళీ కృష్ణ, ధన్‌రాజును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తోన్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. దీంతో CMRF కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారో అని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఏడేళ్లుగా అక్రమాలు జరిగాయని తేలయడంతో ఈ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది ? ఎన్ని నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు నొక్కేశారో ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ కేసు దర్యాప్తు చేసినకొద్దీ నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read:  హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన

 భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!