లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ ..ఎక్కడంటే?
లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. పట్టుబడ్డ వ్యక్తి అందించిన వివరాలు ప్రకారం కృష్ణా జిల్లా కంచికచర్లనుంచి తెలంగాణ, ఏపీలకు పొగాకు ఉత్పత్తులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. పోలీసులు కంచికచర్లలో రహస్యంగా నిర్వహిస్తున్న గోడౌన్‌పై దాడి చేసి సుమారు రూ.5.4 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం గోడౌన్ దాసా శేఖర్ […]
లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. పట్టుబడ్డ వ్యక్తి అందించిన వివరాలు ప్రకారం కృష్ణా జిల్లా కంచికచర్లనుంచి తెలంగాణ, ఏపీలకు పొగాకు ఉత్పత్తులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. పోలీసులు కంచికచర్లలో రహస్యంగా నిర్వహిస్తున్న గోడౌన్‌పై దాడి చేసి సుమారు రూ.5.4 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం గోడౌన్ దాసా శేఖర్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇందులో కాస్మొటిక్ వస్తువుల మధ్య ఉంచిన పొగాకు ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో వెంటనే వాటిని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సరుకులో గుట్కా, ఖైనీ, నిషేదిత సిగరెట్లు వంటివి ఉన్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.