కాసులు పోయి.. కేసులు మిగిలాయ్..సీన్ రివర్స్..

దొరికింది..దొరికినట్టు చక్కా పంచుకోకుండా.. పంపకాల్లో తేడా వస్తే ఇదే జరుగుతోంది. ఎంతో కష్టపడి స్కెచ్ వేసినా కూడా షేరింగ్‌లో తేడా రావడంతో…ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమైపోయింది. ఐడియా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయినవారు..సొత్తు చేజిక్కిచ్చుకోవడంలో చిత్తయిపోయారు. పైగా పోలీసు కేసులను మీదేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ..తాండూరు పట్టణంలోని పాత తాండూరుకు చెందిన నారా శ్యాంసుందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి అనే వ్యక్తులకు చెందిన ఓ పురాతన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు […]

కాసులు పోయి.. కేసులు మిగిలాయ్..సీన్ రివర్స్..
Ram Naramaneni

|

Nov 01, 2019 | 7:34 PM

దొరికింది..దొరికినట్టు చక్కా పంచుకోకుండా.. పంపకాల్లో తేడా వస్తే ఇదే జరుగుతోంది. ఎంతో కష్టపడి స్కెచ్ వేసినా కూడా షేరింగ్‌లో తేడా రావడంతో…ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమైపోయింది. ఐడియా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయినవారు..సొత్తు చేజిక్కిచ్చుకోవడంలో చిత్తయిపోయారు. పైగా పోలీసు కేసులను మీదేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ..తాండూరు పట్టణంలోని పాత తాండూరుకు చెందిన నారా శ్యాంసుందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి అనే వ్యక్తులకు చెందిన ఓ పురాతన ఇంటిని అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేశారు. కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తూ ఉండగా..ఆ ఇంటి గోడల మధ్యల్లో భారీ వెండి కుండల నాణాలు బయటపడ్డాయి. కాకపోతే ఆ సమయంలో అక్కడ ఇంటి ఓనర్స్ ఎవరూ లేపోవడంతో.. తామే పంచుకోవాలని జేసిబి డ్రైవర్‌, ట్రాక్టర్ డ్రైవర్ ఎత్తు వేశారు. అసలే కాసులకు సంబంధించిన విషయం కావడంతో..విషయం బయటకు పొక్కింది. ఇల్లు అమ్మిన వ్యక్తులకు కూడా ఇన్ఫర్మేషన్ అందడంతో వారు కూడా వాటాకి పట్టుబట్టారు. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది.

ఇంతమందికి తెలిసిన విషయం..పోలీసులకు తెలియకుండా ఉంటుందా..?.   రంగంలోకి  దిగి వ్యవహారాన్నంతా బట్టబయలు చేశారు.  మొత్తం 669  వెండి నాణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని 10 మందిపై కేసు నమోదు చేశారు. ప్రొపర్‌గా పంచుకోకుండా ఇలా ఫలహారం అయింది కాక కేసులు కూడా నమోదవ్వడంతో తలలు పట్టుకుంటున్నారు సదరు వ్యక్తులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu