అక్కడన్నీ అబార్షన్లే..కీర్తి రెడ్డి కేసులో హాస్పిటల్ సీజ్..
కీర్తి రెడ్డి అనే అమ్మాయి కన్నతల్లినే అంతమెందిచిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. ఈ కేసులో రివీలవుతోన్న ట్విస్టులు చూసి విచారణ చేస్తున్న పోలీసులు షాక్ అవుతున్నారు. ప్రధాన నిందితురాలైన కీర్తి రెడ్డి ట్రాప్‌లో పడి చేసిన తప్పు.. ఇప్పుడు మూడు కుటుంబాలను రొడ్డుమీదకు తీసుకొచ్చింది. మొదటి ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన కీర్తి రెడ్డి అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని పెద్ద తప్పు చేసింది. దాన్ని బలహీనత తీసుకున్నఅతడు..ఆమెను శారీరకంగా […]
కీర్తి రెడ్డి అనే అమ్మాయి కన్నతల్లినే అంతమెందిచిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారింది. ఈ కేసులో రివీలవుతోన్న ట్విస్టులు చూసి విచారణ చేస్తున్న పోలీసులు షాక్ అవుతున్నారు. ప్రధాన నిందితురాలైన కీర్తి రెడ్డి ట్రాప్‌లో పడి చేసిన తప్పు.. ఇప్పుడు మూడు కుటుంబాలను రొడ్డుమీదకు తీసుకొచ్చింది. మొదటి ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన కీర్తి రెడ్డి అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని పెద్ద తప్పు చేసింది. దాన్ని బలహీనత తీసుకున్నఅతడు..ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు.
అయితే ఈ కేసు ఇప్పుడు ఆమన్‌గల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తి రెడ్డికి అక్కడ గర్భస్రావం ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగ లాగుతున్నారు పోలీసులు. అబార్షన్ చేసిన హాస్పిటల్ పై రంగారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు చేపట్టారు. రజిత హత్య కేసులో ఈ విషయం వెలుగులోకి రావడంతో రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి హాస్పిటల్‌ను సీజ్ చేశారు. గతంలో కూడా అక్కడ పలు అబార్షన్లు జరిగినట్లు సమాచారం.
ఆ నర్సింగ్ హోమ్‌కే ఎందుకు:
కీర్తి రెడ్డితో ప్రేమాయణం నడిపిన బాల్‌రెడ్డి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ క్రమంలో గర్భం దాల్చడంతో ఎల్‌బీ నగర్‌లోని ఓ వైద్యుడిని అబార్షన్ చేయాల్సిందిగా పంప్రదించాడు. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు చేయరని.. ఆమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌కు వెళ్లాలని సూచించాడు. దాంతో పక్కింటి కుర్రాడైన శశి కుమార్‌ను సాయం కోరి తమ వెంట తీసుకెళ్లింది కీర్తి. దీంతో అతడి చేతిలో ఆమె పావుగా మారింది. శారీరకంగానే కాకుండా డబ్బులు పరంగా కూడా అతడు కీర్తిని ఇబ్బందిపెట్టసాగాడు. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ క్రమంలో డబ్బుల కోసం ఆమె కన్నతల్లిని చంపేవరకు వెళ్లింది. పరిపక్వత లేని ప్రేమ, లైంగిక సంబంధాలతో కీర్తి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. డియర్ యూత్ బి కేర్‌ఫుల్.