దారుణం.. ఇద్దరు మహిళల్ని నిర్భంధించి.. ఆపై పదేపదే అత్యాచారం..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కూడా.. కామాంధుల తీరులో మార్పు రావడంలేదు. రోజు దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దేవాలయ ఆవరణలోనే.. ఇద్దరు మహిళల్ని అక్రమంగా నిర్భంధించడమే కాకుండా.. వారిపై పదేపదే అత్యాచారం జరిపాడు ఓ పూజారి. అమృత్‌సర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని లోపోక్ పోలీసుస్టేషన్ పరిధిలోని.. రామ్ తీర్థ్ కాంప్లెక్స్‌లో ఉన్న గురు […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కూడా.. కామాంధుల తీరులో మార్పు రావడంలేదు. రోజు దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దేవాలయ ఆవరణలోనే.. ఇద్దరు మహిళల్ని అక్రమంగా నిర్భంధించడమే కాకుండా.. వారిపై పదేపదే అత్యాచారం జరిపాడు ఓ పూజారి. అమృత్‌సర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని లోపోక్ పోలీసుస్టేషన్ పరిధిలోని.. రామ్ తీర్థ్ కాంప్లెక్స్‌లో ఉన్న గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్‌కు చెందిన ప్రధాన పూజారి.. తమను నిర్బంధించారని ఆరోపించారు ఇద్దరు మహిళలు. అంతేకాదు.. ఆ పూజారి తమపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. పంజాబ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్.. డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన పూజారితో పాటుగా.. మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి రావడాన్ని చూసి పూజారి అనుచరులిద్దరు పారిపోయారని.. అయితే పూజారితో పాటు మరొకర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.



