AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి రన్యా రావుకు కోర్టులో ఎదురుదెబ్బ… మూడు రోజుల కస్టడీ

బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యా రావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల కస్టడీకి అప్పగించించి న్యాయస్థానం . ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు . రన్యా రావుకు నాలుగు రోజుల కస్టడీ కోరారు . 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రన్యా రావు 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI

నటి రన్యా రావుకు కోర్టులో ఎదురుదెబ్బ... మూడు రోజుల కస్టడీ
Actor Ranya Rao
K Sammaiah
|

Updated on: Mar 07, 2025 | 2:36 PM

Share

బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యా రావుకు చుక్కెదురయ్యింది. రన్యా రావును మూడు రోజుల కస్టడీకి అప్పగించించి న్యాయస్థానం . ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు . రన్యా రావుకు నాలుగు రోజుల కస్టడీ కోరారు . 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. రన్యా రావు 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI అధికారులు . ప్రతి సారి ఒకే డ్రెస్‌ తోనే దుబాయ్‌ వెళ్లారని , అందులోనే గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేశారని తెలిపారు. కిలో బంగారం స్మగ్లింగ్‌కు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆమె వసూలు చేసినట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిప్‌కు రూ. 50 లక్షల వరకు రన్యా రావు సంపాదించినట్టు చెబుతున్నారు.

ప్రతీ వారం దుబాయ్‌ వెళ్లిరావడం ఆమెకు అలవాటుగా మారింది. పాస్‌పోర్టుల మీద పాస్‌పోర్టులు తీసుకోవడం.. దుబాయ్‌ వెళ్లిరావడం. ఒక్కోసారి వారానికి రెండుసార్లు కూడా గిట్టుబాటు అయ్యేది. గత 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌ వెళ్లొచ్చిందంటే.. ఆమెకు తగిలిన బంగారు బేరాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్మగ్లింగ్‌ క్వీన్‌గా మారిన.. ఈ బంగారు బాతు రన్యారావు ఏడాదిలో వంద నుంచి రెండు వందల కేజీల బంగారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ట్రిప్‌కు రన్యాకు పదిలక్షల నుంచి 50లక్షల వరకు వస్తుంది. కేజీ బంగారానికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు. పది కేజీలు తీసుకొస్తే 30 నుంచి 50లక్షలు సంపాయిస్తోంది రన్యారావు. అంటే నెలకు కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు వెనకేసుకుంటోంది ఆమె. అపర కుబేరులకు కూడా సాధ్యం కాని విధంగా రన్యారావు సంపాదన ఉంది.

రన్యారావు ఏదైనా లగ్జరీనే. షూటింగ్స్‌ అంటూ మీటింగ్స్‌ అంటూ అధికారులకు సాకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె పట్టుబడకుండా అటు దుబాయ్‌లో ఇక్కడ బెంగళూరులో కొందరు అధికారులు సాయం చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఎవరికైనా పట్టుబడితే తనకున్న కనెక్షన్లను ఉపయోగించి ఫోన్లు చేయించి అక్కడి నుంచి జారుకోవడం అలవాటుగా మార్చుకుంది ఈ మహానటి. అయితే ఈసారి మాత్రం ఆమె ఆటలు సాగలేదు. రెండు నెలల కాలంలో 10సార్లు దుబాయ్‌ వెళ్లిరావడంపై అధికారులకు అనుమానం కలిగింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు.

దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన రన్యారావు.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణికురాలిగా సెక్యూరిటీ చెకింగ్ దాటి బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ సహాయంతో ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న డీఆర్‌ఐ అధికారులు రన్యా రావును అడ్డగించి తనిఖీలు నిర్వహించగా.. ఆమె దుస్తుల్లో కిలోల కొద్ది బంగారం బయటికి వచ్చింది. ముందు తన తండ్రి పేరును అడ్డం పెట్టుకుని బెదిరించబోయిది రన్యారావు. కాని DRI అధికారులు వదల్లేదు. ఆమె దుబాయ్‌ వెళ్లిన ప్రతీసారి ఒకే రకమైన దుస్తులు ధరించేదని అధికారులు చెబుతున్నారు. ఏడాదిలో మొత్తం 30 సార్లు విదేశాలకు వెళ్లివచ్చినట్లు పాస్‌పోర్టు స్టాంపింగ్‌ను బట్టి తెలుసుకున్నారు అధికారులు.