11 Marriages At The Age Of 22: ఆ యువకుడు వయస్సు 22 ఏళ్ళు, చేసుకున్న పెళ్లిళ్లు 11.. లవ్లీ గణేష్ గా యువతులకు వల

ఫేస్ బుక్ తో అమ్మాయిలను పరిచయం చేసుకుని.. మాటలకు కలిపి ప్రేమ పెళ్లి అంటూ మోసం చేస్తున్న ఓ యువకుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. తన 22 ఏళ్ల వయసులో ఒకటి కాదు రెండు ఏకంగా 11 పెళ్లిళ్లు..

11 Marriages At The Age Of 22: ఆ యువకుడు వయస్సు 22 ఏళ్ళు, చేసుకున్న పెళ్లిళ్లు 11.. లవ్లీ గణేష్ గా యువతులకు వల
Follow us

|

Updated on: Jan 17, 2021 | 1:10 PM

11 Marriages At The Age Of 22:ఫేస్ బుక్ తో అమ్మాయిలను పరిచయం చేసుకుని.. మాటలకు కలిపి ప్రేమ పెళ్లి అంటూ మోసం చేస్తున్న ఓ యువకుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. తన 22 ఏళ్ల వయసులో ఒకటి కాదు రెండు ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ నిత్య పెళ్ళికొడుకు. పేరు గణేశ్. చెన్నై లో నివశిస్తున్న ఈ యువకుడు ఫేస్ బుక్ ప్రొఫైల్ లో చూడడానికి అందంగా కనిపిస్తాడు. పేరు కూడా ఆకర్షించే విధంగా లవ్లీ గణేష్ పేరు పెట్టుకున్నాడు. ఈ ఖాతాతో అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటూ వారిని తన మాయమాటలతో ప్రేమలోకి దింపుతాడు. అనంతరం వారిని పెళ్లి చేసుకోవడమే ఇతని ప్రవృతి. ఇలా 22 ఏళ్ల గణేష్ ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతని 11వ భార్య గణేష్ పై అనుమానంతో ఎంక్వైరీ చేసింది. నిజస్వరూపాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఫేస్‌బుక్ ద్వారా 2017లో చెన్నైలోని కొలాథూర్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయితో గణేష్ కు పరిచయం ఏర్పడింది. ఒకరు కనెక్ట్ అయ్యారు. ప్రేమలో పడ్డారు. గణేశ్, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఇద్దరూ మేజర్లే కావడంతో 5 డిసెంబర్ 2020 న గణేష్ బాలికను ఏకాంత ప్రదేశంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం విల్లివాక్కం రాజాజీ నగర్‌లో వీరిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఆ ఇంట్లోకి గణేష్ 17 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పనిమనిషి అని చెప్పాడు. అయితే ఆబాలికతో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో భార్య గణేష్ ను ప్రశ్నించింది.

దీంతో ఆయువతిని ఒక గదిలో బంధించి శారీరకంగా హింసించాడు. గణేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య ఆరా తీసి, తనకన్నా ముందు అతనికి 10 పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకుని షాక్ కు గురైంది. 10 మందిని అతను మోసం చేశాడని, తాను 11వ దాన్నని తెలుసుకుంది. ఈ విషయం ఎవరికైనా చంపేస్తానంటూ గణేష్ బెదిరించాడు. ఆ యువతి చేతులను తాడులతో కట్టి, నోటిని బట్టలతో కొట్టి లైంగిక వేధింపులకు గురిచేశాడు. తన తల్లిదండ్రులను చూడాలని అమ్మాయి చెప్పినప్పుడు, గణేష్ తనను ఓదార్చినట్లు నటించి ఆమెను మద్యం తాగేలా చేశాడు. తన స్నేహితులతో శారీరక సంబంధం కలిగి ఉండమని బలవంతం చేశాడు. దారుణంగా హింసించాడు. అతని భార్య సమయం చూసుకుని ఇంటి యజమానులకు తన పరిస్థితి చెప్పి.. సహాయం అర్ధించింది. వారి సాయంతో గణేష్ నుంచి తప్పించుకుని పుట్టింటికి చేరుకుంది. తరువాత పోలీసులను ఆశ్రయించింది. ఆపై విచారించిన పోలీసులు గణేశ్ ను అరెస్ట్ చేసి, కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

Also Read: కర్ణాటక పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజిబిజీ.. పలు అభివృద్జి పనులకు శంకుస్థాపన