పరీక్షల్లో కాపీ కొడుతుందంటూ విద్యార్థిని దుస్తులు విప్పించిన టీచర్.. అవమానం భరించలేని ఆ బాలిక..
ఓ టీచర్ చేసిన అనాలోచిత పనికి బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ అనుమానంతో టీచర్ చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది. దీంతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ షాకింగ్ సంఘటన..

ఓ టీచర్ చేసిన అనాలోచిత పనికి బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. పరీక్షల్లో కాపీయింగ్ చేస్తుందంటూ అనుమానంతో టీచర్ చేసిన పని ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది. దీంతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ షాకింగ్ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్‌షెడ్‌పూర్‌లో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన 9వ తరగతి చదువుతోన్న ఓ బాలిక ఇటీవల జరిగిన పరీక్షలకు హాజరైంది. అయితే ఇదే సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న టీచర్ ఆ బాలిక కాపీయింగ్ చేస్తోందన్న అనుమానంతో పక్క గదిలోకి తీసుకెళ్లి బట్టులు విపించింది. బాలిక ఎంత ప్రతిఘటించినా టీచర్ మాత్రం ససేమిరా అంది. దీంతో తనకు జరిగిన అవమానాన్ని భారంగా భావించిన సదరు బాలిక ఇంటికి వెళ్లగానే ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య యత్నం చేసింది.
ఈ విషయాన్ని గమనించిన బాలిక కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ బాలిక చావుబతుకుల మధ్య ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై పాఠశాల వర్గాలు ఇంత వరకు స్పందించలేదు. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన చేపట్టారు, వెంటనే సదరు టీచర్‌ను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




