AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. కోడలిపై మామ అత్యాచారం… ప్రశ్నించినందుకు కొడుకునే చంపేశాడు…

ఉత్తరప్రదేశ్‌లోని మొరదబాద్‌ జిల్లా మజోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ తన కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. కోడలిపై మామ అత్యాచారం... ప్రశ్నించినందుకు కొడుకునే చంపేశాడు...
Shiva Prajapati
|

Updated on: Nov 29, 2020 | 7:08 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మొరదబాద్‌ జిల్లా మజోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ(56) తన కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ విషయం కాస్తా బాధితురాలు తన భర్తకు చెప్పగా.. అతను తన తండ్రిని నిలదీశాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన మామ.. కోడలి భర్తను(తన కొడుకును) తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి, బాధితురాలికి ఏడాది క్రితం వివాహం అయ్యింది. అయితే నవంబర్ 25వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా బాధితురాలి భార్త, అత్త అక్కడికి వెళ్లారు. ఇంట్లో బాధితురాలు, ఆమె మామ మాత్రమే ఉన్నారు.

ఆ సమయంలో కోడలిపై మామ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తన భర్తకు, అత్తకు బాధితురాలు చెప్పింది. దీంతో ఆగ్రహించిన భర్త.. తన తండ్రిని నిలదీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించాడు. అలా తండ్రికి, కొడుక్కి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తండ్రి తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకువచ్చి కొడుకుని కాల్చాడు. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతన్ని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయాడు. దీంతో మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.?
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
హైదరాబాదులోని ఆ రోడ్డుకి డోనాల్డ్ ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
శింబు, ధృవ్​ రిజెక్ట్​ చేసిన కథను ఓకే చేసిన స్టార్​ హీరో!
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
17 సిక్సర్లు, 5 ఫోర్లతో 160..ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు మామ
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షల
ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది
ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది
కాలుష్యం బారి నుంచి శరీరాన్ని కాపాడే సూపర్​ డ్రింక్స్​!
కాలుష్యం బారి నుంచి శరీరాన్ని కాపాడే సూపర్​ డ్రింక్స్​!
చలికాలంలో వీటిని తినకపోవడమే మంచిదంటున్న నిపుణులు!
చలికాలంలో వీటిని తినకపోవడమే మంచిదంటున్న నిపుణులు!
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే ఇంత డేంజరా..?తప్పక తెలుసుకోండి,లేదంటే
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే ఇంత డేంజరా..?తప్పక తెలుసుకోండి,లేదంటే
'ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశారు'.. వేణు ఊడుగుల ఎమోషనల్
'ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశారు'.. వేణు ఊడుగుల ఎమోషనల్