Mysore Gang Rape Case: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఓ మైనర్ సహా అయిదుగురి అరెస్ట్..
మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందినవారని, వీరిలో ఒకరు మైనర్ బాలుడని ఆయన చెప్పారు. అతడికి 17 ఏళ్ళు ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు.
మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందినవారని, వీరిలో ఒకరు మైనర్ బాలుడని ఆయన చెప్పారు. అతడికి 17 ఏళ్ళు ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. వీరంతా లేబరర్స్ అని.సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో వీరిని అరెస్టు చేయగలిగామన్నారు. తరచూ వీరు మైసూరుకు వస్తూంటారని.. నేరం జరిగిన రోజు ఈ నిందితులు పూటుగా మద్యం సేవించి ఉన్నారని తెలిసిందన్నారు. ఈ నెల 24 న తన స్నేహితునితో కలిసి చాముండేశ్వరీ హిల్స్ కి వెళ్లిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగగా.. ఆమె స్నేహితుడిని నిందితులు కర్రలతో చితకబాదారు. నిందితుల్లో కొందరికి నేరచరిత్ర ఉందని ప్రవీణ్ సూద్ వెల్లడించారు. వీరిలో ఒకరిని చామరాజ్ నగర్ లో అరెస్టు చేశారు. ఈ రేపిస్టులను పట్టుకున్న పోలీసు బృందానికి పోలీసు శాఖ 5 లక్షల రివార్డు ప్రకటించింది.
ఈ గ్యాంగ్ రేప్ ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించగా.. తనను ఆ పార్టీ ‘రేప్’ చేస్తోందంటూ సాక్షాత్తూ రాష్ట్ర హోమ్ మంత్రి జ్ఞానేంద్ర కౌంటర్ ఇచ్చారు. అసలు రాత్రి 7 గంటల సమయంలో నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో ఈ విద్యార్థిని ఏం చేస్తోందని కూడా అయన చేసిన వ్యాఖ్య వివాదాస్సదమైంది. ఇలా ఉండగా ఈ ఘటన నేపథ్యంలో మైసూరు యూనివర్సిటీ.. తమ విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు.. బాధితుని వెల్లడి
మైసూరు గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితుడు, యువతి స్నేహితుడు .. తనను నిందితులు 3 లక్షలు డిమాండ్ చేశారని పోలీసులకు తెలిపాడు. ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేసి స్పృహ కోల్పోయేంతవరకు కొట్టారని అన్నాడు. ఈ నెల 24 న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తాను..తన స్నేహితురాలు బైక్ పై వెళ్తుండగా వీరు అడ్డగించారని.. వారిలో ఒకడు మూడు లక్షలివ్వాలని డిమాండ్ చేశాడని..పైగా తన మొబైల్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసి ఈ సొమ్ము చెల్లించాలని కోరాడని ఆ యువకుడు తెలిపాడు. ఇతని స్టేట్ మెంటును పోలీసులు నమోదు చేశారు. అటు రాష్ట్ర హోమ్ మంత్రి జ్ఞానేంద్ర.. మైసూరు లోనే ఉండి కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షిస్తున్నారు. కాగా బాధిత యువతి ఇంకా షాక్ లోనే ఉంది. మైసూరు గ్యాంగ్ రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఒళ్లుగగ్గుర్లు పొడిచే వీడియో ఇది..! మరిన్ని వైరల్ వార్తలపై స్పెషల్ వీడియో :Special All Viral Videos.
రెండు జంతు జాతుల స్నేహబంధం.. హిప్పోపై తాబేళ్లు ఫ్రీ రైడ్.. వీడియో వైరల్:Turtles on Hippo Back Video.
భార్య అంటే మరి ఇంత ప్రేమా..! భార్య చితిలోకి దూకి.. పతి సహగమనం చేసిన భర్త..:Viral Video.