మహిమలున్న శంఖమట.. బ్యాటరీతో చిన్న ట్రిక్ ప్లే చేసి.. ఏకంగా రెండు కోట్లు కొల్లగొట్టాడు

శంఖానికి అతీంద్రీయ మహిమలు ఉంటాయా.. అవి మన దగ్గర ఉంటే శక్తులు సిద్ధిస్తాయా. అస్సలు ఈ వ్యవహారం ఏంటో తెలియాలంటే...

మహిమలున్న శంఖమట.. బ్యాటరీతో చిన్న ట్రిక్ ప్లే చేసి.. ఏకంగా రెండు కోట్లు కొల్లగొట్టాడు
Conch Cheating
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 28, 2021 | 1:08 PM

శంఖానికి అతీంద్రీయ మహిమలు ఉంటాయా.. అవి మన దగ్గర ఉంటే శక్తులు సిద్ధిస్తాయా. అస్సలు ఈ వ్యవహారం ఏంటో తెలియాలంటే మొత్తం స్టోరీలోకి వెళ్లాల్సిందే. శంఖానికి రెండు వైపులా పెట్టిన మందార మొగ్గలు.. క్షణాల్లోనే విచ్చుకుంటున్నాయి. బకెట్‌లో ఉన్న బియ్యం నుంచి శంఖం పైకి ఉబికివస్తోంది. అలా కళ్ల ముందు జరిగితే ఎవరైనా సరే.. ఆ శంఖానికి శక్తి ఉందనే అనుకుంటారు. ఇది నిజంగానే శంఖానికి ఉన్న శక్తి వల్ల జరిగిందా లేక ఇంకేమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా.. లేక మ్యాజిక్కా అన్నది కనీసం ఆలోచించరు. అవతలి వాడు చెప్పిందే నిజమని దాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు.  అయితే ఇలాంటి క్రేజీ సీన్స్ చూపించి.. తమిళనాడులో ఓ దొంగ స్వామీజీ కోట్లు కొల్లగొట్టాడు.

అమాయకంగా కనిపిస్తున్న ఓ బాబా ఈ మొత్తం ఎపిసోడ్‌కు.. కర్త, కర్మ, క్రియగా  వ్యవహరించాడు. మహిమగల శంఖం అంటూ.. రెండు కోట్లకు అక్షరాల.. రెండు కోట్ల రూపాయలకు అమ్మాడు. బియ్యంలో అడుగున ఉన్న శంఖం పైకి రావడంతో.. శక్తులు ఉన్నాయని నమ్మించి రెండు కోట్లు కొట్టేశారు. తిరువణ్ణామలైలోని గిరివలం దర్శనానికి .. ఎక్కడెక్కడ నుంచో భక్తులు తరలివస్తారు. వాళ్ల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ స్వామీజీ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ పనులు చేసేందుకు ఆయన.. సెపరేట్ గ్యాంగ్‌నే మెయింటెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. లోకల్ బీజేపీ లీడర్ కూడా ఇందులో భాగస్వామిగా పనిచేస్తున్నారు.

బియ్యంలో నుంచి శంఖం పైకి రావడంతో.. మహిమలు గల శంఖం అని నమ్మి.. ఓ వ్యాపారి రెండు కోట్లకు కొన్నాడు. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో.. అందరి లెక్కా తేల్చే పనిలో పడ్డారు. బ్యాటరీ సాయంతో ఈ ట్రిక్ చేసినట్టు గుర్తించారు. స్వామీజీతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి ట్రిక్కులకు ఎవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్.. పవర్‌ఫుల్ పంచ్‌లు వేసిన బాబు గోగినేని

వైరస్ టెర్రర్.. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో 76 మందికి కరోనా

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..