AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్.. పవర్‌ఫుల్ పంచ్‌లు వేసిన బాబు గోగినేని

Veeramachaneni Ramakrishna: గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్సిటీ.. వీరమాచనేని రామకృష్ణ‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయం ఇప్పుడు కాంట్రవర్సికి...

వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్.. పవర్‌ఫుల్ పంచ్‌లు వేసిన బాబు గోగినేని
Veeramachaneni Vs Babu Gogineni
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2021 | 12:05 PM

Share

గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్సిటీ.. వీరమాచనేని రామకృష్ణ‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయం ఇప్పుడు కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారింది. డైట్‌కు సంబంధించి ఆయన చేసిన కృషికి విజ్ఞాన వర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు విజ్ఞాన్ యూనివర్సిటీ తెలిపింది. అసలు ఆయనకు ఉన్న అర్హత ఏంటి?.. సైన్స్‌ను తప్పుబట్టే వారికి కూడా డాక్టరేట్‌లు ఇస్తారా?.. డాక్టరేట్‌ ఇచ్చే ముందు రూల్స్ చేక్ చేశారా?… అసలు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏం చెప్తోంది?.. అసలు డీమ్డ్‌ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్‌ ఏంటి?.. అంటూ సైన్స్‌ మాటలతో హేతువాదులు పవర్ పంచ్‌లు విసురుతున్నారు.

నిజాన్ని ఎదుర్కొలేని వారే తప్పు కౌంటర్లు వేస్తున్నారంటూ వీరమాచనేని మరోసారి సవాలు విసిరారు. గతంలో చెప్పిన దానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ కాని డయాబెటిస్‌కు వైద్యం అందించడం ఎందుకున్నది వీరమాచనేని ప్రశ్న. “వీఆర్కే డైట్‌తో డయాబెటిస్ తగ్గిస్తున్నాను, అల్లోపతితో నయం చేయలేనిది వీఆర్కే డైట్ వల్ల సాధ్యం అయింది. దాని గురించి ఎవరితోనైనా ఛాలెంజ్‌కి రెడీ” అని అంటున్నారు వీరమాచనేని. దీనికి హేతువాది బాబు గోగినేని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు మన దగ్గర డయాబెటీస్ లేదని చెప్పిన వ్యక్తికి డాక్టరేట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్య సమస్యలను తగ్గించేది మందులు కాదు. మనం తీసుకునే తిండి అంటారు వీరమాచనేని రామకృష్ణ. తాను రెండు నెలల్లో 30 కిలోలు తగ్గానంటే.. తాను తీసుకున్న ఆహారమే ఇందుకు కారణమని స్పష్టం చేస్తున్నారు.

కరోనాకు వంటింటి పోపుల డబ్బా పరిష్కారం అన్నావు. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నావు” అంటూ వీరమాచనేనికి కౌంటర్ ఇస్తున్నారు బాబు గోగినేని. మాస్క్‌ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్‌ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. వీరమాచనేని చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ గోగినేని మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే రామకృష్ణకు డాక్టరేట్ ఇవ్వడం ఏంటి?… ఇది గౌరవ డాక్టరేట్లకున్న గౌరవాన్ని తగ్గించటమేనని హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. డాక్టరేట్లు వచ్చిన వారందరూ డాక్టర్లు అవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన యూజీసీని కోరుతున్నారు.

Also Read: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

వైరస్ టెర్రర్.. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో 76 మందికి కరోనా