AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Games: వీడియో గేమ్స్‌కి బానిసైన బాలుడు.. ఏకంగా తన తల్లికే ఊహించని షాకిచ్చాడు..

Online Game: ఆధునిక ప్రపంచంలో మొబైల్ వీడియో గేమ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోజురోజుకి పిల్లలు మొబైల్ వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారి.. చిన్నతనంలోనే

Video Games: వీడియో గేమ్స్‌కి బానిసైన బాలుడు.. ఏకంగా తన తల్లికే ఊహించని షాకిచ్చాడు..
Boy On Mobile Game
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2021 | 11:14 AM

Share

Online Game: ఆధునిక ప్రపంచంలో మొబైల్ వీడియో గేమ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రోజురోజుకి పిల్లలు మొబైల్ వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారి.. చిన్నతనంలోనే చేయరాని పనులు చేస్తున్నారు. అయితే వీడియో గేమ్స్‌ పిల్లలపై ఎంత దుష్ప్రభావం చూపిస్తున్నాయో తెలియజేసే సంఘటన మంగళవారం ఢిల్లీలో వెలుగుచూసింది. ‘ఫ్రీ ఫైర్’ మొబైల్‌ గేమ్‌ ఆడటం కోసం ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా తన తల్లి బంగారు హారాన్ని విక్రయించాడు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి.. ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాలు.. ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు గత కొన్నాళ్లుగా మొబైల్‌ఫోన్‌లో ‘ఫ్రీ ఫైర్’ వీడియో గేమ్‌ ఆడుతున్నాడు. ఆ గేమ్‌ ఆడాలన్నా.. గెలవాలన్నా.. దానిలోని ఆయుధాలను ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా కొనాల్సి ఉంటుంది. గేమ్ ఆడే ప్రారంభంలో.. తండ్రి జేబులో డబ్బులు కొట్టేసి కొనుగోలు చేసేవాడని తేలింది. ఈ క్రమంలో ఇటీవల బాలుడికి భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో.. ఇంట్లో దాచిపెట్టిన తల్లి బంగారు హారాన్ని రూ.20వేలకు విక్రయించాడు.

ఆతర్వాత.. తన దొంగతనం గురించి ఇంట్లో వాళ్లకి ఎక్కడ తెలిసిపోతుందని మంగళవారం ఇంట్లో నుంచి పారిపోయాడు. ఢిల్లీలో కిలింది ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ రైల్వేస్టేషన్‌లో దిగాడు. ఈ క్రమంలో బుధవారం.. ఉదయం అలీగఢ్‌ రైల్వేస్టేషన్‌లో తిరుగుతున్న బాలుడిని గమనించిన ఓ ప్రయాణికుడు ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది అతడిని కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు.

ఈ క్రమంలో బాలుడు జరిగిన విషయాన్ని వెల్లడించాడు. వెంటనే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అలీగఢ్‌ వచ్చి బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. కరోనా లాక్‌డౌన్ నుంచి పాఠశాలలు బంద్ కావడంతో.. ఆన్‌లైన్ తరగతుల కోసం మొబైల్ ఫోన్ ఇప్పించినట్లు వ్యాపారి అయిన బాలుడి తండ్రి వెల్లడించాడు. అప్పటినుంచి తమ బాలుడు వీడియో గేమ్స్‌కి అడిక్ట్ అయినట్లు వెల్లడించాడు. అప్పటినుంచి ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Also Read:

Diabetes : నోటిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్ అని అర్థం..! ఏంటో తెలుసుకోండి..

Viral Video: రోడ్డుపై యువతుల ‘స్ట్రీట్ ఫైట్’.. పంచ్‌లతో చితక్కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో!