Viral Video: రోడ్డుపై యువతుల ‘స్ట్రీట్ ఫైట్’.. పంచ్‌లతో చితక్కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో!
సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వెరైటీగా ఉంటాయి...
సోషల్ మీడియా ప్రపంచంలో తరచూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వెరైటీగా ఉంటాయి. ఇక అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ముగ్గురు యువతులు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. రోడ్డుపై ఆ ముగ్గురు రెజ్లర్స్ మాదిరిగా కొట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇద్దరు యువతులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరికి మరో యువతి ఎడురుపడుతుంది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అప్పటివరకు బాగానే ఉన్న సీన్ కాస్తా.. ఫైట్ సీన్ అయిపోతుంది. ఆ ఇద్దరు యువతులు మూడో యువతిపై దాడికి దిగారు. ఇష్టమొచ్చినట్లు తన్నుకుని కొట్టుకున్నారు.
ఆ ఇద్దరు యువతుల దాడికి.. మూడో యువతి మొదట షాక్ అయినా.. అంతలోనే తేరుకుని ఆమె కూడా వారిని తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. అక్కడున్న వారంతా వీరి గొడవను వింతగా చూస్తూ నిలబడి వీడియో తీశారు తప్పితే.. ఆ యువతులను ఆపేందుకు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ, తన్నుకుంటూ, జుట్టు పీక్కుంటూ కొద్దిసేపు బీభత్సం సృష్టించారు.
ఈ సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడో తెలియదు. అసలు వారు ఎందుకు కొట్లాటకు దిగారో తెలియదు. ‘సాటు-సైనీ’ అనే యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వామ్మో.! లేడీ రెజ్లర్స్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ”వీరిని బాక్సింగ్ పోటీలకు పంపిస్తే మెడల్ ఖాయం’ అంటూ మరొకరు.. ‘వీరిని ఎవడు కట్టుకుంటాడో వాడు మటాషే’ అంటూ ఇంకొకరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read:
లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!
పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!
View this post on Instagram