AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ వ్యాప్తంగా 2.53 కోట్ల‌కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,53,87,250కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,50,600 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 68,27,632 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,77,09,018 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి..

ప్రపంచ వ్యాప్తంగా 2.53 కోట్ల‌కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 8:16 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,53,87,250కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,50,600 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 68,27,632 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,77,09,018 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 61,73,236కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,87,224 మంది మృతి చెందారు. కాగా 25,60,289 యాక్టీవ్ కేసులు ఉండగా, 34,25,723 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్ ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

భార‌త‌ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 971 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 36,21,245కి చేరుకుంది. ఇందులో 7,81,975 యాక్టివ్ కేసులు ఉండగా.. 64,469 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 27,74,801 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Follow Us
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!
గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!