AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,10,430 కేసులు నమోదు కాగా.. మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1,64,12,815కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌ 6,52,039 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 57,18,414 యాక్టీవ్ కేసులు ఉండగా, కోటి మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకుని..

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 8:14 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 2,10,430 కేసులు నమోదు కాగా.. మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1,64,12,815కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌ 6,52,039 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 57,18,414 యాక్టీవ్ కేసులు ఉండగా, కోటి మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 56,130 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 43,71,839కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,49,849 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 48,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,67,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 8,85,577 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 705 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 32,063 మంది మరణించారు.

Read More: తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు