AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఆగ‌ని క‌రోనా వ్యాప్తి.. ఉధృతంగా కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 7:53 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే.. గడిచిన 24 గంటల్లో 47,645 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 7627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వీటిల్లో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా.. 46,301 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1041కి చేరుకుంది.

అటు ఆదివారం 3041 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 56 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. నిన్న ఒక్క రోజే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో 1095, పశ్చిమగోదావరిలో 859 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 734, చిత్తూర్ 573, గుంటూరు 547, కడప 396, కృష్ణ 332, నెల్లూరు 329, ప్రకాశం 242, శ్రీకాకుళం 276, విజయనగరం 247, విశాఖపట్నం 784 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 13,486 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కర్నూలులో 162 కరోనా మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. కాగా కొత్తగా ఎనిమిది మంది వైరస్ కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 54,059కి చేరగా.. మృతుల సంఖ్య 463కి చేరుకుంది. నిన్న 998 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,332 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణలో 12,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 15,654 టెస్టింగ్స్ జరగ్గా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,53,425 మందికి టెస్టులు జరిగాయి.

ఇక జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 640 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 171, వరంగల్‌ అర్బన్‌ 131, మేడ్చల్‌ 91, కరీంనగర్‌ 51, నాగర్‌కర్నూల్‌ 46, ఆదిలాబాద్‌ 14, భద్రాద్రి 17, జగిత్యాల 2, జనగామ 21, భూపాలపల్లి 3, జోగులాంబ గద్వాల 5, కామారెడ్డి 36, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 38, మహబుబాబాద్ 29, మంచిర్యాల 27, మెదక్ 21, ములుగు 12, నల్లగొండ 6, నారాయణపేట 7, నిర్మల్ 1, నిజామాబాద్‌ 32, పెద్దపల్లి 16, సిరిసిల్ల 27, సంగారెడ్డి 61, సిద్దిపేట 5, సూర్యాపేట 22, వికారాబాద్ 9, వనపర్తి 1, వరంగల్‌ రూరల్ 21, యాదాద్రి భువనగిరిలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

Follow Us