AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌కు లైన్ క్లియర్.. ఈ రూట్లోనే పరుగులు.. ముహూర్తం ఫిక్స్!

వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. వీటిల్లో స్లీపర్ క్లాసులు లేవు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు అసౌకర్యానికి గురవుతున్నారు.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్‌కు లైన్ క్లియర్.. ఈ రూట్లోనే పరుగులు.. ముహూర్తం ఫిక్స్!
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Jul 24, 2026 | 1:43 PM

Share

వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు మొదలై చాలా రోజులు కాగా.. ఏపీ, తెలంగాణలో ఈ వెర్షన్ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. త్వరలో ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది. విజయవాడ డివిజన్‌లో దీనిని తీసుకురానున్నారని వార్తలు వస్తున్నాయి. విజయవాడ-బెంగళూరు, విజయవాడ- చెన్నై లేదా విశాఖపట్నం-బెంగళూరు మార్గంలో దీనిని ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు.

ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్

ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లల్లో స్లీపర్ క్లాసులు లేవు. కేవలం కూర్చోని ప్రయాణం చేయగలిగే విధంగా సీట్లు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రాత్రి సమయంలో కూర్చోని ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలో తొలి రైలు హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది దసరా నుంచి విజయవాడ డివిజన్‌లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్వల్ప, మధ్య దూర ప్రయాణాల కోసం చైర్ కార్ కోచ్‌లను కలిగి ఉండగా.. ఈ స్లీపర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా రాత్రిపూట, సుదూర ప్రయాణాల కోసం రూపొందించారు. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నంకు నడుస్తున్నాయి. స్లీపర్ రైళ్లను అంతరాష్ట్ర ప్రయాణాల కోసం వినియోగించనున్నారు.

విమానం తరహాలో లగ్జరీ సౌకర్యాలు

వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో 16 కోచ్‌లు ఉంటాయి. విమానం తరహాలో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఎల్ఈడీ లైటింగ్, సౌండ్‌ప్రూఫ్ క్యాబిన్‌లు, హై-స్పీడ్ వై-ఫై కనెక్టివిటీ, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల కోసం ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌లతో కూడిన ప్రీమియం ఇంటీరియర్‌లు ఉంటాయి. అటు సికిింద్రబాద్-ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది.

Follow Us
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు