AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్..

ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గర్తింపు ధృవీకరణ పత్రాల్లో ఒకటిగా ఉంది. దీంతో ఇందులో వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. వివరాలు తప్పుగా ఉంటే అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల అత్యంత వేగంగా సేవలు పొందవచ్చు. లేకపోతే వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు రావొచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే జీవితాంతం ఇబ్బందులు తప్పవ్..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Jul 24, 2026 | 1:21 PM

Share

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేనిది మీరు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. పాఠశాలలు, కళాశాలల నుండి బ్యాంకులు, కార్యాలయాల వరకు.. ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డులు అనేవి అవసరమవుతాయి. అయితే చాలామంది ఆధార్ కార్డులు తీసుకున్న తర్వాత వాటిని అప్‌డేట్ చేసుకోలేరు. అవసరమైనప్పుడు చేసుకోవచ్చులే అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దీని వల్ల మీరు అత్యంత వేగంగా సేవలు పొందవచ్చు. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయకపోతే సేవలు పొందటంలో సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును ఎప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే..?

మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శాశ్వతంగా నివాసం మార్చుకున్నా లేదా చాలాకాలం నుంచి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నా మీ ఆధార్ కార్డులోని అడ్రస్ మార్చుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయకపోతే.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం, లోన్ పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంక్, రుణ పత్రాలు, ఏటీఎం కార్డు వంటివి మీ ఆధార్ రిజిస్టర్డ్ అడ్రస్‌కు డెలివరీ అవుతాయి. మీరు ఆధార్‌లో మార్చుకోకపోతే పాత అడ్రస్‌కు వెళతాయి. ఇక ఆధార్ కార్డులో నమోదైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. మీరు మొబైల్ నెంబర్ మార్చినప్పుడు వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ధృవీకరణ కోసం OTP అవసరం. ఒకవేళ మొబైల్ నంబర్‌ను మార్చకపోతే OTP రాదు. అటువంటి సందర్భంలో వివిధ సేవలను పొందడంలో సమస్యలు తలెత్తవచ్చు. ఇక ఆధార్ కార్డులో మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే మార్చుకోండి. ఒక్కొ పత్రంలో ఒక్కొలా పేర్లు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

అప్డేట్ చేసుకోవడం వల్ల లాభాలు..

ఇక చిన్న పిల్లలకు చైల్డ్ ఆధార్ ఉంటుంది. పిల్లలు పెద్దయ్యాక వారు తమ బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేసుకుని కొత్త ఆధార్ కార్డు పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్‌డేట్‌ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఆధార్ కార్డులో పాత ఫోటో ఉన్నా సమస్య లేదు. అయితే ముఖం ఫోటోతో అస్సలు సరిపోలకపోతే ఫోటోను అప్‌డేట్ చేేసుకోవాలి. బ్యాంకింగ్, టెలికాం లేదా ఏదైనా ప్రభుత్వ సేవను పొందేటప్పుడు ముఖ ధృవీకరణ విఫలమైతే.. ఆధార్‌ను మళ్లీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!