విజయ్ దేవరకొండ ఫ్యామిలీలోకి.. కొత్తగా వచ్చింది ఎవరో తెలుసా…?
సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటారు. తన కుటుంబలో ఏం జరిగిన అందులో పోస్టులు పెడుతుంటారు. తనకు సంబంధించిన అన్ని అంశాలను అభిమానులతో పంచుకుంటారు. ఇప్పుడు తాజాగా...
Vijay Deverakonda Introduces : యూత్‌లో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సృష్టించుకున్న విజయ్ దేవరకొండ.. ఎలాంటి పని చేసినా అందులో ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడు కొత్తగా కనిపించేలా స్పెషల్ ఫోకస్ పెడుతారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన విజయ్… తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి ప్రజలకు కొవిడ్-19పై అవగాహన కల్పించారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు శానిటైజర్లను పంపిణీ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటారు. తన కుటుంబలో ఏం జరిగిన అందులో పోస్టులు పెడుతుంటారు. తనకు సంబంధించిన అన్ని అంశాలను అభిమానులతో పంచుకుంటారు. ఇప్పుడు తాజాగా తన ఫ్యామిలీలో ఓ కొత్త మెంబర్ వచ్చారు అంటూ ఇన్స్టాగ్రామ్‌లో అభిమానులకు పరిచయం చేశారు. ఈ లాక్ డౌన్ సమయం ఈ బుజ్జి కుక్కతో ఎంతో సరదాగా గడుస్తోందని పేర్కొన్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ లైక్స్ తో ముంచేస్తున్నారు.