లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

గత నెలరోజులుగా లాక్‌డౌన్‌తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లోనే కూర్చొని పిచ్చెక్కుతోందంటూ.. సోషల్ మీడియోలో పలువురు ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. అందులోనూ ఒక్క రూపాయి సంపాదన లేక బుర్ర వేడుక్కుతోంది. ఏ ఇంట్లో చూసినా ఇదే ఫ్రస్ట్రేషన్..

  • Tv9 Telugu
  • Publish Date - 5:56 pm, Sat, 25 April 20
లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

గత నెలరోజులుగా లాక్‌డౌన్‌తో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అందులోనూ ఒక్క రూపాయి సంపాదన లేక బుర్ర వేడుక్కుతోంది. ఏ ఇంట్లో చూసినా ఇదే ఫ్రస్ట్రేషన్! దీంతో ఇంట్లోనే కూర్చొని పిచ్చెక్కుతోందంటూ.. సోషల్ మీడియోలో పలువురు ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. అందుకే, మీ ఒత్తిడిని పోగొట్టేందుకు ఓ వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చింది వెంట్ ఆల్ ఔట్ (వీఏఓ) అనే సోషల్ మీడియా యాప్. దీంతో ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించేలా వీఏఓ ఆఫర్‌ ప్రకటించింది.

అదేంటంటే.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రతీ ఒక్కరిలో నిరాశ, ఒత్తిడి పెరిగి పోయింది. దీంతో వారు ఈ సమయంలో ఎలాంటి ఫ్రస్ట్రేషన్‌ని ఫీల్ అవుతున్నారో దాన్ని ఓ స్టోరీలా రాసి ఇందులో పోస్ట్ చేయవచ్చు. దీంతో ఒక్కసారిగా ఈ యాప్‌కి బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్‌ ద్వారా 12 వేల మంది రిజిస్టర్ అయ్యారు. ఇలా లాక్‌డౌన్ కాలాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నం చేస్తోంది వీఏఓ యాప్. వెంట్ అండ్ ఎర్న్‌లో ఒక్కో స్టోరీకి 12 రూపాయల వరకూ సంపాదించవచ్చు. కనీసం ఒక కథకు 100 పదాలు ఉండాలి. ఇలా ఎన్ని పంపిస్తే అంత మనీ గెలుచుకోవచ్చు.

అలాకాకపోయినా ఏదైనా స్టోరీలకు మినిమమ్ 50 పదాల కామెంట్ పెట్టినవారు ఈ వీఏఓకు అర్హులవుతారు. అయితే ఆ కంటెంట్ అండ్ ఎర్న్‌ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దేశ వ్యతిరేక లేదా దొంగలించిన కంటెంట్‌ను వీఏవో అనుమతించదు.

ఈ సందర్భంగా వీఏఓ వ్యవస్థాపకుడు సుమిత్ మిత్తల్ మాట్లాడుతూ.. గత కొద్ది నెలల్లోనే వీఏఓ వేదికపై ప్రజలు గడిపే కాలం గణనీయంగా పెరిగిందన్నారు. మా వెబ్‌సైట్‌ను సుమారు 66 శాతం మంది ఇష్టపడుతున్నారన్నారు. లాక్‌డౌన్ వేళ యూజర్లు వారి కథలను మాతో పంచుకుంటున్నారని, అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మా నిపుణులను అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే వారిని ఉత్సాహపరచడానికి ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు సుమిత్ మిత్తల్ తెలిపారు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..