కరోనా నేపథ్యంలో భజరంగ్ దళ్ కీలక నిర్ణయం..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృందంగం గురించి తెలిసిందే. ఇప్పటికే 22వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 5లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన భారత్‌లో కూడా ఇది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 16మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 700 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృందంగం గురించి తెలిసిందే. ఇప్పటికే 22వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 5లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఇక మన భారత్‌లో కూడా ఇది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 16మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 700 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక తెలంగాణలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ ప్రకటించింది సర్కార్. ఈ క్రమంలో బజరంగ్ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా.. చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత.. వీర హనుమాన్ విజయ యాత్ర చేపడుతూ వస్తోంది. దాదాపు లక్ష మంది హనుమత్ భక్తులు బైక్ ర్యాలీ చేపట్టేది. అయితే ఈ సారి.. కరోనా ఎఫెక్ట్‌తో.. బజరంగ్ దళ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన జరగాల్సి ఉన్న హనుమాన్ ర్యాలీని విరమించుకుంటున్నట్లు తెలంగాణ బజరంగ్ దళ్ కన్వినర్ సుభాష్ చందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.




