Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..

చిన్నమ్మ జైలు నుంచి విడుదల నేపథ్యంలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులకు షాక్‌ తగిలింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో...

  • Sanjay Kasula
  • Publish Date - 11:27 pm, Thu, 21 January 21
Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..

చిన్నమ్మ జైలు నుంచి విడుదల నేపథ్యంలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులకు షాక్‌ తగిలింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శశికళకు కొవిడ్‌ పాజివిగ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శశి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షా కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈనెల 27న బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నమ్మ జ్వరం బారిన పడటంతో జైలు అధికారులు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

జ్వరంతో పాటు జలుబు, దగ్గు, ఊపరి తీసుకోవడంలో శశికళ ఇబ్బంది పడుతున్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ వార్త చిన్నమ్మ అభిమానులను షాక్‌కు గురి చేసింది. శశి ఆస్పత్రిలో చేరుతున్న సమయంలో ఆమెను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులను చూసి చేతులూపుతూ అభివాదం చేశారు. శశికళ జైలు నుంచి విడుదల కాగానే  పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అభిమానులు.

ఇందులో భాగంగా హొసూరు నుంచి చెన్నైకి కాన్వాయ్‌ రూపంలో ర్యాలీకి నిర్ణయించారు. ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధరణ కావడంతో వారంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మరోవైపు జైలు నుంచి శశికళ బయటకు వచ్చినా, అన్నాడీఎంకేకు ఢోకా లేదని, అమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు సీఎం పళనిస్వామి.