వారెవా ! పురిటి బిడ్డకు ‘శానిటైజర్’ పేరు..

కరోనా తాండవ సమయంలోనూ సరికొత్త వింతయిన, తమాషా అయిన వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో కొత్తగా పుట్టిన గడుగ్గాయిలకు వారి తలిదండులు ఈ ‘సీజన్’ కి తగినట్టు పేర్లు పెడుతుండడం విశేషం. ఏపీలో ఇటీవల అప్పుడే పుట్టిన పసికందులకు ‘కరోనా కుమార్’, ‘కరోనా కుమారి’ అని వారి పేరెంట్స్ పేర్లు పెడితే యూపీలో మరో జంట ఇంకో ముందడుగు వేసి.. తమ మగ  బిడ్డకు ‘శానిటైజర్’ అని నామకరణం చేశారు. ఈ కరోనా కాలంలో శానిటైజర్ తో చేతులను […]

వారెవా ! పురిటి బిడ్డకు 'శానిటైజర్' పేరు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 7:33 PM

కరోనా తాండవ సమయంలోనూ సరికొత్త వింతయిన, తమాషా అయిన వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో కొత్తగా పుట్టిన గడుగ్గాయిలకు వారి తలిదండులు ఈ ‘సీజన్’ కి తగినట్టు పేర్లు పెడుతుండడం విశేషం. ఏపీలో ఇటీవల అప్పుడే పుట్టిన పసికందులకు ‘కరోనా కుమార్’, ‘కరోనా కుమారి’ అని వారి పేరెంట్స్ పేర్లు పెడితే యూపీలో మరో జంట ఇంకో ముందడుగు వేసి.. తమ మగ  బిడ్డకు ‘శానిటైజర్’ అని నామకరణం చేశారు. ఈ కరోనా కాలంలో శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంతో ఆరోగ్యదాయకమని, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఈ చిన్నారి తండ్రి ఓంవీర్ అన్నారు. ప్రస్తుతం చేతులపైని సూక్ష్మజీవులను తొలగించుకునేందుకు ప్రతివారూ శానిటైజర్ వాడుతున్నారని, అంటే దీని ప్రాముఖ్యం ఎంత ఉందో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నాడు. అందుకే తమ బిడ్డకు ఈ పేరు పెట్టామని చెప్పాడు. సహారన్ పూర్ జిల్లాలో నిన్న తమకు జన్మించిన చిన్నారికి ఈ పేరు పెట్టి ఆ తలిదండ్రులు తమ సరదా తీర్చుకున్నారు. ఇక మధ్యప్రదేశ్ లో ఈ నెల 7 న పుట్టిన చిన్నారికి ‘లాక్ డౌన్ ‘ అని పేరు పెట్టారట.