టీ సర్కార్ కీలక నిర్ణయం: హైదరాబాద్‌లో మరో 2 కోవిడ్ ఆస్పత్రులు
తెలంగాణలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను
తెలంగాణలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిస్థాయి కొవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే ఏర్పాట్లు చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
సికింద్రాబాద్‌లో గల గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ కేర్ సెంటర్‌గా..ఇప్పటి వరకు బాధితులకు వైద్యం అందజేస్తున్నారు. కాగా, తాజాగా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మరో రెండు ప్రభుత్వాసుపత్రులు కరోనా చికిత్సల కోసం అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ కేర్ సెంటర్లుగా పేషెంట్లకు సేవలందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ఆస్పత్రులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించటంతో పాటు, వ్యాధి నియంత్రణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఫీవర్ ఆసుపత్రిలో 340 పడకలు ఉంటే కరోనా పేషెంట్ల కోసం 190 వరకు ఉపయోగిస్తున్నారు. మరో 100 ఐసీయూ పడకలను తీర్చిదిద్దితే పూర్తిస్థాయిలో వైద్యం అందించవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు వెంటనే తగిన ఏర్పాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అటు, కింగ్‌కోఠి ఆసుపత్రిలో 350 పడకలు ఉంటే 200 పడకల్లో కరోనా రోగులకు సేవలందిస్తోంది. ఇక్కడా 200 పడకలను ఐసీయూ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.