‘కరోనా కాలర్ ట్యూన్’తో విసుగుచెందారా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి
కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. 'కోవిడ్-19 జాగ్రత్త చర్యల' కాలర్ ట్యూన్ వస్తుంది. ఇంకా ఈ వ్యాధి తొలి రోజుల్లో అయితే పొడి దగ్గుతో కాలర్ ట్యూన్ మొదలయ్యేది. ఈ కాలర్ ట్యూన్ విని మొదట అందరూ షాక్‌కి..

కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ‘కోవిడ్-19 జాగ్రత్త చర్యల’ కాలర్ ట్యూన్ వస్తుంది. ఇంకా ఈ వ్యాధి తొలి రోజుల్లో అయితే పొడి దగ్గుతో కాలర్ ట్యూన్ మొదలయ్యేది. ఈ కాలర్ ట్యూన్ విని మొదట అందరూ షాక్‌కి అయ్యారు. ఇటీవల టెలికాం సంస్థలు దగ్గుకు సంబంధించిన ఆడియో భాగాన్ని కత్తిరించాయి. దీంతో మిగిలిన ట్యూన్ వినీ వినీ వినియోగదారులు విసుగు చెందుతున్నారు. ఈ ట్యూన్ దాదాపు నిమిషం పాటు వస్తోంది. ఏదైనా అర్జెంట్ కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడు.. కాలర్స్‌కి కాస్త ఇబ్బందిగా మారుతోంది.
ఇటీవలే ఈ కరోనా కాలర్ ట్యూన్‌పై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తన వాడీ వేడీ చర్చ జరుగుతోంది. దీనిపై పలు రకాల మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్నాయి. ప్రధాని మోదీని అభ్యర్థిస్తూ.. ఈ టోన్ తీసేయమని విన్నవించుకుంటూ ఉన్న వీడియోస్, మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కరోనా కాలర్ ట్యూన్ వినకుండా ఉండేందుకు ఈ చిన్నపాటి మెళకువలు పాటిస్తే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వారు కాల్ చేసే క్రమంలో డయలర్‌లోని ఏదో ఒక నెంబర్ నొక్కితే కాలర్ ట్యూన్ ఆగిపోయి, సాధారణ రింగ్ టోన్ వినిపిస్తుంది. ఇక ఐఫోన్స్ వాడే వారైతే డయలర్‌లోని హ్యాష్ బటన్‌ను ప్రెస్ చేస్తే కాలర్ ట్యూన్ ఆగిపోతుంది. ఇక అసలు మొత్తానికే ఈ ట్యూన్ వినొద్దు అనుకున్నవారు.. ఫేస్ బుక్ మెసెంజర్, గూగుల్ డ్యుయో, వాట్సాప్‌ల ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడమే.
ఇది కూడా చదవండి:



