కరోనా రోగులపై లాఫింగ్ థెరపి..వైద్యుల వినూత్న ప్రయోగం

కరోనా పాజిటీవ్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యులు సరికొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. బెడ్లపైనే ఉన్న కరోనా పాజిటీవ్‌ బాధితులు..

కరోనా రోగులపై లాఫింగ్ థెరపి..వైద్యుల వినూత్న ప్రయోగం
Follow us
Jyothi Gadda

| Edited By:

Updated on: May 20, 2020 | 4:58 PM

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గ‌త‌ 24 గంటల్లో ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ 140 మందిని బ‌లి తీసుకుంది. కొత్తగా రికార్డు స్థాయిలో 5,611 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. భారత్‌లో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతుండగా, రోజుకు వందకు పైగానే బాధితులు మృత్యువాతపడుతున్నారు. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ముంబయిలో కోవిడ్ విలయ తాండవం చేస్తోంది.

ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ..కరోనా పాజిటీవ్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వైద్యులు సరికొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. రోగులు ఆనందంగా ఉండేలా లాఫింగ్‌ థెరపిని ప్రయోగిస్తున్నారు. ముంబైలోని దాదర్స్‌ శిల్వ స్కూల్లో ఏర్పాటైన కోవిడ్‌ కేర్‌ సెంటర్లో తాజాగా ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. బెడ్లపైనే ఉన్న కరోనా పాజిటీవ్‌ బాధితులు..చప్పట్లు కొట్టి వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాసేపు ఆనందంగా నవ్వుకోవడంతో పాటు ఉల్లాసంగా ఉండేలా కబుర్లు చెప్తున్నారు. కరోనా వల్ల భయపడాల్సిన పనిలేదని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. లాఫింగ్‌ థెరపిపై కరోనా బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు చేస్తున్న ఇటువంటి వినూత్న ప్రయత్నానికి నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.