ఈ నెల 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !?

ఈ నెల 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !?

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. మాల్స్ కూడా ఇదే త‌ర‌హా నిబంద‌న‌లు అమ‌లుతో అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Jyothi Gadda

|

May 09, 2020 | 7:44 AM

మూవీ ప్రియుల‌కు శుభవార్తే..లాక్ డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి మూతప‌డిన సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సినిహాల్స్‌, షాపింగ్ మాల్స్ వంటివి మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, జ‌న‌స‌మూహంగా ఎక్కువ‌గా గుమిగూడే ఏరియాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. అయితే, వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త‌ను బ‌ట్టి మూడు జోన్లుగా విభ‌జించారు. రెడ్, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లుగా విభ‌జించారు. రెడ్ జోన్ ప‌రిధిలో క‌ఠిన నిబంధ‌లు అమ‌లు చేస్తూ…ఆరెంజ్ జోన్‌లో కొంత మేర స‌డ‌లింపు నిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని నిర్ధారించుకున్న గ్రీన్ జోన్‌ల‌లో కార్య‌క‌లాపాల‌ను మెల్లిమెల్లిగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే… ఈ నెల 18వ తేది నుంచి  సినిమా థియేట‌ర్ల‌కు కూడా అనుమ‌తించే అవ‌కాశం ఉందంటున్నారు.

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 18 నుంచి గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ మిన‌హా గ్రీన్ జోన్ లో మూడు ఆట‌ల‌కు అనుమ‌తులివ్వ‌నుంది.. రాత్రి 7 గంట‌ల లోపు మూడు ఆట‌లు పూర్తి కావాల‌నే నిబంధ‌న విధించ‌నుంది.. అలాగే సినిమా హాల్స్ లో సీటు కి సీటు మ‌ధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాల‌ని సూచించింది. ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని నిబంధ‌న విధించింది.. మాస్క్ ధ‌రించాల‌ని కోరింది.. అలాగే గ్రీన్ జోన్స్ లోని మాల్స్ కూడా ఇదే త‌ర‌హా నిబంద‌న‌లు అమ‌లుతో అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. షాపింగ్ మాల్స్ సైతం సాయంత్రం 6 గంట‌ల లోగా మూసివేయాల‌ని సూచించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu