ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

కరోనా కాలంలో ఎంతోమంది సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అలాంటివారి కోసం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో త్వరలోనే కొలువుల జాతర రానున్నట్లు తెలిపింది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సచివాలయాల్లో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. పరీక్షలకు అనుమతి రాగానే ఆగష్టు 31 నాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని కూడా ఆగష్టు 31 […]

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!
Follow us

|

Updated on: May 09, 2020 | 7:46 AM

కరోనా కాలంలో ఎంతోమంది సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అలాంటివారి కోసం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో త్వరలోనే కొలువుల జాతర రానున్నట్లు తెలిపింది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సచివాలయాల్లో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. పరీక్షలకు అనుమతి రాగానే ఆగష్టు 31 నాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని కూడా ఆగష్టు 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు.

కాగా, ఏపీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1887 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 41 మంది ప్రాణాలు విడిచారు. ఇక ఈ మహమ్మారి బారి నుంచి 842 కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పడుతున్న సామాన్య ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది.

Read More:

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!