తెలంగాణాలో ఇవాళ కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,132కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 727 మంది కోలుకున్నారని., ఇవాళ ఒక్కరోజే 34 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 376 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య 29గానే ఉందని ఈటెల రాజేందర్ వివరించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 14 జిల్లాల్లో కరోనా లేదని, వాటిని గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1887కు చేరగా.. 1,004 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read this Story Also: స్క్రిప్ట్ ప్రకారమే అంతే.. : సుధీర్‌పై రష్మి కామెంట్లు