కరోనాఎఫెక్ట్‌: సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్ర‌క‌టించిన తొలి విద్యాసంస్థ‌

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా విద్యాసంస్థ‌లు కూడా ...

కరోనాఎఫెక్ట్‌: సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్ర‌క‌టించిన తొలి విద్యాసంస్థ‌
Follow us

|

Updated on: Mar 28, 2020 | 10:36 AM

కరోనా వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. పెద్ద ఎత్తున కరోనా నివారణ చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా విద్యాసంస్థ‌లు కూడా విరాళాలు ప్రక‌టించ‌డం హ‌ర్ష‌నీయం.

ది హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌…హైద‌రాబాద్‌లో పేరుగాంచిన విద్యాసంస్థ‌. 90 ఏళ్ల‌కు పైబ‌డిన ఘ‌న చ‌రిత్ర ఈ స్కూల్ సొంతం. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సోసైటీ త‌మ వంతు విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10లక్ష‌లు విరాళం అంద‌జేసి దాతృత్వం చాటుకున్నారు. జీహెచ్ ఎంసీ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో ఎంద‌రికీ ఉచిత భోజ‌నం అంద‌జేస్తున్న అక్ష‌య ఫౌండేష‌న్‌కు మ‌రో రూ. 5ల‌క్ష‌లు అంద‌జేసి క‌రోనాపై ప్ర‌భుత్వాలు చేస్తున్న యుద్ధంలో తాము సైతం అనిపించుకుంది. ఈ విద్యా సంస్థలో చదివిన ఎందరో విద్యార్థులు అత్యున్నత స్థానాల‌లో స్థిరపడ్డారు. 2014 ఫిబ్రవరి 4 న ఈ సంస్థ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ మూడవ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా నియమింపబడ్డారు. అయితే, విప‌త్కార స‌మ‌యాల్లో విరాళాలు ప్ర‌క‌టించిన తొలి విద్యాసంస్థ‌గా హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ సోసైటీ మారోమారు త‌న ఘ‌న‌త చాటుకుంది.