బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షో నిర్వాహకులు నాగార్జున హోస్టుగా చేస్తున్నట్టు ప్రోమోలు కూడా విడుదల చేశారు. దీంతో ఈ షో తొందరలోనే మొదలు కాబోతుందని అంచనా..
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షో నిర్వాహకులు నాగార్జున హోస్టుగా చేస్తున్నట్టు ప్రోమోలు కూడా విడుదల చేశారు. దీంతో ఈ షో తొందరలోనే మొదలు కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు బిగ్‌బాస్-4 కంటెస్టెంట్ లిస్ట్‌ల విషయంలో కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ షోను నాగార్జున పుట్టిన రోజున అంటే ఆగష్టు 29 లేదా 30న ప్రారంభం చేయబోతున్నారని ప్రచారం కూడా జరగబోతుంది.
ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బిగ్‌బాస్ షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరందరినీ ఓ స్టార్ హోటల్‌లో ఉంచినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ న్యూస్ బిగ్‌బాస్ ప్రేక్షకులని షాక్‌కి గురి చేసింది. బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొనబోయే ఓ కంటెస్టెంట్స్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు పలు వెబ్‌సైట్లు వార్తలు రాస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నవారిలో ఓ సింగర్‌కి పాజిటివ్ నిర్థారణ అయిందట. ప్రస్తుతం ఆ సింగర్‌కి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారట. షో ప్రారంభం అయ్యేనాటికి ఆ కంటెస్టెంట్‌కి నెగిటివ్ రాకపోతే.. ఆ సింగర్ స్థానంలో మరొకరిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సారి బిగ్‌బాస్ సీజన్-4ను సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేశారట. ఇక సీజన్-4లో సింగర్ నోయల్, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడు, నందు, అలాగే యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే, గంగవ్వ, కొరియాగ్రాఫర్ రఘు మాస్టర్, జబర్దస్త్ కెవ్వు కార్తిక్ లేదా రాం ప్రసాద్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read More:
కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య