తమిళనాడులో కొత్తగా 5,951 కరోనా కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 107 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,352కి, మరణాల సంఖ్య 6,721కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6,998 మంది కరోనా నుంచి..
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 107 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,352కి, మరణాల సంఖ్య 6,721కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6,998 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,32,454 మంది కోలుకోగా, ప్రస్తుతం 52,128 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Tamil Nadu reports 5,951 new COVID-19 cases, 6,998 recoveries and 107 deaths, taking active cases to 52,128, recoveries to 3,32,454 and deaths to 6,721: State Health Department pic.twitter.com/yFizQ7OO8E
— ANI (@ANI) August 25, 2020
Read More:
కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి
సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య